జనంలో భక్తి భావన రోజు రోజుకూ ముదిరిపోతున్నది. భక్తిని దాటి పిచ్చిగా మారుతున్నది.
జనంలో భక్తి భావన రోజు రోజుకూ ముదిరిపోతున్నది. భక్తిని దాటి పిచ్చిగా మారుతున్నది. ఇందుకు మంచి ఉదాహరణ ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన ! వృందా వన్ నగర్ లో బాంకే బిహారీ అనే శ్రీ కృష్ణుడి ఆలయం ఉంది. కార్తీక మాసం కాబట్టి ఆ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వస్తూ వస్తూ తమతో టీ కప్పులు తెచ్చుకున్నారు. శ్రీకృష్ణుడి దర్శనం తర్వాత ఆలయం వెనుక భాగం లో ఉన్న ఏనుగు శిల్పం నుంచి కారుతూ ఉన్న నీటిని దక్కించుకోవడం కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు నీటిని టీ కప్పులో నింపు కుంటుంటే కొందరేమో చేతిలో తీర్థం తీసుకుంటున్నట్టు ఏసీ నుంచి కారే నీటిని తమ చేతుల్లో తీసుకుంటున్నారు. గుడి నిర్మాణ సమయంలో ఏసీ లను ఏర్పాటు చేశారు. ఆ ఏసీ ల నుంచి వచ్చే నీటిని బయటకు పంపించడానికి ఏనుగు ఆకారం లో గొట్టాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు భక్తులు పవిత్ర జలమని తీసుకుంటున్నది ఆ ఏసీ నీరే కావడం గమనార్హం.