ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 17, 18 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ కేసులో యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్‌పర్సన్ రేణుకా మిశ్రాను ఆమె పదవి నుంచి తప్పించారు. రిక్రూట్‌మెంట్ బోర్డు బాధ్యతలు చేపట్టేందుకు కొత్తగా ఐపీఎస్ రాజీవ్ కృష్ణ నియమితులయ్యారు. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష సమయంలో పేపర్ లీక్ కేసు నిర్వహణలో లోపం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం వంటి కారణాలతో రిక్రూట్‌మెంట్ బోర్డు డైరెక్టర్ జనరల్ గా పదవిలో ఉన్న రేణుకా మిశ్రాను తొలగించారు. పరీక్ష రద్దు తర్వాత, రిక్రూట్‌మెంట్ బోర్డు ఎలాంటి నివేదికను సమర్పించలేకపోయింది.. ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 17, 18 తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక ప్రకటన ప్రకారం, UPSRTC బస్సులు అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలకు ఉచిత రవాణాను అందిస్తాయని.. ఆరు నెలల్లోపు పరీక్షను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Updated On 5 March 2024 12:38 AM GMT
Yagnik

Yagnik

Next Story