ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) అత్యంత దారుణం చోటు చేసుకుంది. బారాబంకీ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒళ్లు జలదరించేలా చేసింది. బారాబంకీ జిల్లాకు చెందిన అనిల్(Anil) అనే వ్యక్తి తాపీ మేస్త్రీ పని చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు.

Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) అత్యంత దారుణం చోటు చేసుకుంది. బారాబంకీ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒళ్లు జలదరించేలా చేసింది. బారాబంకీ జిల్లాకు చెందిన అనిల్(Anil) అనే వ్యక్తి తాపీ మేస్త్రీ పని చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. ఎనిమిదేళ్ల కిందట అతడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం(Extra marital affair) పెట్టుకున్నదని అనిల్ అనుమానించాడు. ఈ విషయంపై ఆలుమగలిద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. క్షణికావేశానికి గురైన అనిల్ వెంట తెచ్చుకున్న కత్తితో భార్య తలను నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తెగ నరికిన భార్య తల ఒక చేతిలో, కత్తి మరో చేతిలో పట్టుకుని రోడ్డు మీదకు వచ్చాడు. వందలాది మంది చూస్తుండగా రోడ్డుపై చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాడు. చివరకు కొందరు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు వచ్చి అనిల్‌ను అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
