ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బులంద్‌షహర్‌లో(Bulandshahr) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కన్నతల్లిని రోడ్డుపై పరుగెత్తిస్తూ మరీ కొట్టాడు. చేతిలో కర్ర పట్టుకుని తల్లి వెంట నింపాదిగా పడుతుంటే, పాపం ఆ తల్లి కొడుకు చేతికి చిక్కకుండా ఆపసోపాలు పడుతూ పరుగెత్తింది.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బులంద్‌షహర్‌లో(Bulandshahr) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కన్నతల్లిని రోడ్డుపై పరుగెత్తిస్తూ మరీ కొట్టాడు. చేతిలో కర్ర(Stick) పట్టుకుని తల్లి వెంట నింపాదిగా పడుతుంటే, పాపం ఆ తల్లి కొడుకు చేతికి చిక్కకుండా ఆపసోపాలు పడుతూ పరుగెత్తింది. సాయం చేయాలంటూ ఆ తల్లి(Mother) అభ్యర్థిస్తూ పరుగెత్తడం చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. ఓ ఆలయ ఆవరణలో ఇదంతా జరుగుతున్నా చుట్టుపక్కల ఉన్న జనం చోద్యం చూస్తూ నిలబడ్డారే కానీ ఆ తల్లికి ఎవరూ సాయం చేయలేదు. చివరకు తల్లిని దొరికించుకున్న ఆ యువకుడు కట్టెతో విచక్షణారహితంగా కొట్టాడు. అక్కడే ఉన్న స్థానికుడు ఒకరు ఈ దారుణాన్ని తన సెల్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడే కానీ.. అతడు కూడా వాడిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. మొత్తం మీద చుట్టుపక్కల ఉన్నవారు స్పందించారు. వాడిని పట్టుకుని తల్లిని కాపాడారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వచ్చి వాడిని పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు.