పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. ఆ పైవాడు పెళ్లిళ్లను నిర్ణయిస్తాడని చెబుతారు. ఇది నిజమే కావొచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pardesh) బులంద్‌షహర్‌లో నివసించే మహ్మద్ అర్షద్(Arshad Warsi) విషయం చూస్తే నిజమేననిపించక మానదు. పాపం పెళ్లి కోసం అతగాడు 15 సంవత్సరాలు ఎదురుచూశాడు. ఒకటిన్నర దశాబ్దం పాటు ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చిందంటే అతగాడికి పెళ్లీడు వచ్చిందే కానీ ఎత్తు పెరగలేదు.
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. ఆ పైవాడు పెళ్లిళ్లను నిర్ణయిస్తాడని చెబుతారు. ఇది నిజమే కావొచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pardesh) బులంద్‌షహర్‌లో నివసించే మహ్మద్ అర్షద్(Arshad Warsi) విషయం చూస్తే నిజమేననిపించక మానదు. పాపం పెళ్లి కోసం అతగాడు 15 సంవత్సరాలు ఎదురుచూశాడు. ఒకటిన్నర దశాబ్దం పాటు ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చిందంటే అతగాడికి పెళ్లీడు వచ్చిందే కానీ ఎత్తు పెరగలేదు. కేవలం 3.7 అడుగులు(3.7 feet) మాత్రమే ఉంటాడు. విచిత్రసోదరులు సినిమాలో కమలహాసన్ టైపు అన్నమాట! దాంతో ఇతడిని మనువాడేందుకు ఏ మగువా ముందుకు రాలేదు. ఎత్తే పెళ్లికి ప్రతిబంధకంగా మారింది. వయసేమో పెరుగుతూ వుంది. చివరకు ఇన్నాళ్లకు అర్షద్‌కు ఓ జోడి కుదిరింది. సయానా నగరంలో ఫర్నీచర్ వ్యాపారం చేసుకుంటున్న మహ్మద్ అర్షద్‌కు పెళ్లి సమస్యగా మారింది. ఇక కాదేమోనన్న బెంగ ఓవైపు, కుటుంబసభ్యుల ఆందోళన మరోవైపు అతడిని నిద్రపట్టకుండా చేసేవి. పైగా చుట్టుపక్కలవాళ్ల వెకిలి కామెంట్లు వినలేక ఇబ్బంది పడేవాడు. పదిహేనేళ్లలో సుమారు పది మంది అమ్మాయిలను పెళ్లి చూపుల్లో చూసి ఉంటాడు. ఏ అమ్మాయి ఇతడిని ఇష్టపడలేదు. నాలుగు నెలల కిందట నాలుగు అడుగుల ఎత్తున్న సోనా గురంచి ఓ బంధువు చెప్పడంతో ఎగిరి గంతేశాడు. వెంటనే అర్షద్ కుటుంబసభ్యులు వెళ్లి సోనా ఫ్యామిలీతో మాట్లాడారు. చివరకు ఫిబ్రవరి 14వ తేదీన బుధవారం సరిగ్గా ప్రేమికుల రోజున 30 ఏళ్ల సోనాను(Sona) పెళ్లి చేసుకున్నాడు. అర్షద్ ఫ్రెండ్స్ స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.
సన్‌రూఫ్ నుంచి మెరూన్ కలర్ షేర్వానీ ధరించి బయటకు వచ్చిన మహ్మద్ అర్షద్ వరుడు కావడం చూసిన ప్రతి ఒక్కరు తెగ ఆనందపడ్డారు. బంధువులు బ్యాండ్‌తో వధువును తీసుకురావడంతో సందడి పెరిగింది. తో కన్విన్స్ చేసిన తర్వాత, సోనా కుటుంబం తనను అంగీకరించిందని అర్షద్ తెలిపాడు. మొత్తం మీద అర్షద్-సోనా పెళ్లి వైభవంగా జరిగింది.