ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2023 నుండి నాలుగు శాతం పెంచబోతున్నట్లు తెలిపింది. ఈ పెంపు తర్వాత ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్‌లు 38 నుంచి 42 శాతానికి పెరగనున్నాయి.

UP CM Yogi Adityanath gift to state Employees Dearness Allowance increased by 4 percent
ఉత్తరప్రదేశ్(Utter Pradesh) రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులు(Employees), పెన్షనర్ల(Pensioners)కు డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance), డియర్‌నెస్ రిలీఫ్ (Dearness Relief)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2023 నుండి నాలుగు శాతం పెంచబోతున్నట్లు తెలిపింది. ఈ పెంపు తర్వాత ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ(DA), డీఆర్(DR)లు 38 నుంచి 42 శాతానికి పెరగనున్నాయి. డీఏ పెంపు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ఆమోదం తెలిపారు. డీఏ-డీఆర్ పెంపుతో 16 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులు, 11.5 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
మార్చి 24న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 42 శాతం పెంచింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, డీఆర్‌లను నాలుగు శాతం పెంచబోతోంది. జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర ఉద్యోగులకు పెరిగిన డీఏ వారి జీపీఎఫ్(GPF) ఖాతాలోకి వెళ్తుంది. మే నెలలో పెరిగిన డీఏ మే నెల జీతంతో పాటు జూన్‌లో నగదు రూపంలో చెల్లిస్తారు.
