డబ్బెట్టి కొన్నాం కాబట్టి వెహికిల్‌ను ఇష్టం వచ్చేసినట్టుగా మార్చేసుకుంటాం అంటే కుదరదు. చివరకు రంగు మార్చాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాలి. పాపం అది తెలియని ఈర్దన్ బ్రదర్స్ తమ కారు(Car)ను హెలికాఫ్టర్(helicopter)గా మార్చారు. అది జీవనోపాధికి దోహదపడుతుందని భావించారు. వారు అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి. పోలీసులు వచ్చి కారు కమ్ హెలికాఫ్టర్(Car Helicopter)ను సీజ్ చేశారు.
డబ్బెట్టి కొన్నాం కాబట్టి వెహికిల్‌ను ఇష్టం వచ్చేసినట్టుగా మార్చేసుకుంటాం అంటే కుదరదు. చివరకు రంగు మార్చాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాలి. పాపం అది తెలియని ఈర్దన్ బ్రదర్స్ తమ కారు(Car)ను హెలికాఫ్టర్(helicopter)గా మార్చారు. అది జీవనోపాధికి దోహదపడుతుందని భావించారు. వారు అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి. పోలీసులు వచ్చి కారు కమ్ హెలికాఫ్టర్(Car Helicopter)ను సీజ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్‌కు చెందిన ఈశ్వర్దీన్, పరమేశ్వర్దీన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ తమ పాత మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్(Maruti Suzuki Wagon R)ను హెలికాఫ్టర్‌గా మార్చారు. పెళ్లి ఊరేగింపులకు అద్దెకు ఇచ్చుకోవాలన్నది వారి ఐడియా! అందుకోసం హలికాఫ్టర్ రోటర్ బ్లేడ్‌ను కారు పైకప్పుకు వెల్డింగ్ చేసి అతికించారు. కారు బూట్‌కు హెలికాఫ్టర్‌కు ఉండే తోకను జత చేశారు. మొత్తంగా కారును చక్కగా హెలికాఫ్టర్‌గా మార్చారు. ఇక కలర్స్ వేయడమే మిగిలింది. దాని కోసమే కారును తీసుకుని వెళుతున్నప్పుడు పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెహికిల్‌ను సీజ్ చేశారు. మార్పులకు అనుమతి తప్పనిసరి కాబట్టే మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అన్నదమ్ములు ఫైన్ కట్టేసి వాహనాన్ని విడిపించుకున్నారు.