రజనీకాంత్‌కు(Rajinikanth) మునపటంత క్రేజ్‌ లేదని అంటుంటారు కానీ తలైవా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఏడు పదుల వయసులోనూ యువ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. వంద కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడు. అసలు సూపర్‌స్టార్‌ అనే పేరు తెరపై కనిపిస్తే చాలు థియేటర్‌లో ప్రకంపలను పుట్టుకొస్తాయి.

రజనీకాంత్‌కు(Rajinikanth) మునపటంత క్రేజ్‌ లేదని అంటుంటారు కానీ తలైవా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఏడు పదుల వయసులోనూ యువ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. వంద కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడు. అసలు సూపర్‌స్టార్‌ అనే పేరు తెరపై కనిపిస్తే చాలు థియేటర్‌లో ప్రకంపలను పుట్టుకొస్తాయి. రజనీ సినిమా విడుదలవుతుందంటే చాలు తమిళనాడులో పండగ వాతావరణం కనిపిస్తుంది. గత కొంతకాలంగా రజనీకి చెప్పుకోదగ్గర హిట్‌ పడలేదు. అయినా వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఇప్పుడు రజనీకాంత్‌ నటించిన జైలర్‌(Jailer) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

చాన్నాళ్లుగా ఓ సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ సినిమా బంపర్‌ హిట్టవుతుందన్న నమ్మకం కుదిరింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల సందర్భంగా యూనో ఆక్వా కేర్‌(Uno Aqua Care)అనే కంపెనీ ఆగస్టు 10వ తేదీన సెలవు ప్రకటించింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఉచితంగా సినిమా టికెట్లు(Movie Tickets) ఇవ్వనుంది. చెన్నైతో పాటు బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్‌నగర్‌ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించినట్టు ఆ సంస్థ తెలిపింది. నెల్సన్‌ కుమార్(Nelson Kummar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా(Tama) హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేశాయి.

Updated On 7 Aug 2023 3:15 AM GMT
Ehatv

Ehatv

Next Story