ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోరం జరిగింది. ఉన్నావ్ దళిత బాలిక(unnao dalit girl) అత్యాచార ఘటనలో నిందితులు దారుణానికి తలబడ్డారు. బాధితురాలిపై దాడి చేశారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో బాధితురాలి ఆరు నెలల కొడుకుతో పాటు, రెండు నెలల వయసున్న సోదరి తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా మారడంతో కాన్పూర్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం జరిగిన ఈ ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోరం జరిగింది. ఉన్నావ్ దళిత బాలిక(unnao dalit girl) అత్యాచార ఘటనలో నిందితులు దారుణానికి తలబడ్డారు. బాధితురాలిపై దాడి చేశారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో బాధితురాలి ఆరు నెలల కొడుకుతో పాటు, రెండు నెలల వయసున్న సోదరి తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా మారడంతో కాన్పూర్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం జరిగిన ఈ ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. తమ కూతురును చంపడానికే నిందితులు ఇంటికి నిప్పు పెట్టారని బాధితురాలి తల్లి పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఉన్నావ్‌కు చెందిన 11 ఏళ్ల బాలికపై గత ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన నిందితులు ఈ మధ్యనే బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసును వెనక్కి తీసుకునేందుకు బాధితురాలు ఒప్పుకోకపోవడంతోనే నిందితులు ఇంతకు తెగించారు. నిందితులతో రాజీకి ఒప్పుకోవడం లేదన్న కారణంతో గత నెలలో బాధితురాలి తాత, మామ కలిసి బాధితురాలి తండ్రిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.