ఆర్జేడీ ఎమ్మెల్యే బహదూర్‌సింగ్‌పై పాట్నాలో పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్యే బహదూర్‌సింగ్‌(MLA Bahadur Singh) నాలుకను కోస్తే పది లక్షల రూపాయల బహుమతి పొందుతారని శివభవానీ(Shiva bhavani) సేన పేరుతో పాట్నాలో పోస్టర్లు(Poster) అంటించారు. దీనిపై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఇలాంటి నక్కలకు భయపడేది లేదన్నారు. ఈ మధ్య బహదూర్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల హిందూసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సంఘ సంస్కర్త సావిత్రిబాయి చెప్పిన మాటలను బహదూర్‌సింగ్‌ ఉటంకిస్తూ 'ఆలయం అంటే మానసిక బానిసత్వం.. గుడి గంట మోగిస్తే అజ్ఞానం వైపు అడుగులు.. బడి గంట మోగిస్తే జ్ఞానం వైపు వెళ్తామని' బహదూర్‌సింగ్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో పలు హిందూసంఘాలు ఆయనపై మండి పడుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాట్నాలో(Patna) ఎమ్మెల్యే నాలుక కట్‌ చేయాలని పోస్టర్లు వెలిశాయి. దీనిపై ఆయన స్పందిస్తూ ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు. ప్రత్యర్థులు ఏలాంటి చర్యలకు పాల్పడినా తనకు భయం లేదన్నారు. బడుగు, బలహీనవర్గాలు, మహిళలకు చదువే ముఖ్యమని అన్నారు. ఇందు కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తన నాలుక కోసుకుంటే రూ.10 లక్షలు అంటూ పోస్టర్ అంటించిన వారు సోషలిస్ట్‌ భావాలను ఒకసారి వినాలని కోరారు. మూఢ నమ్మకాల వైపు వెళ్లాలా, విద్య వైపు వెళ్లాలో ఆలోచించాలని కోరారు. దేశాన్ని విభజించేవారు, కుట్రలు చేసేవారే ఇలాంటి చర్యలకు పాల్పడతారని ఎమ్మెల్యే బహదూర్‌సింగ్‌ మండిపడ్డారు.

Updated On 4 Jan 2024 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story