అయ్యప్పస్వామి(Ayyappa Swamy) ఇప్పుడు తెలుగువారికి కూడా ఆరాధ్యదేవుడయ్యాడు. అయ్యప్పమాలను ధరించేవారికి ఎక్కువ శాతం తెలుగువారే ఉండటం ఇందుకు నిదర్శనం. అయితే చాలా మందికి అయ్యప్పస్వామి పుట్టిన రోజు ఎప్పుడనే విషయం తెలియదు. నిజానికి కేరళ పంచాంగాని(Kerala Panchangam)కి మన పంచాగానికి చాలా తేడాలుంటాయి.
అయ్యప్పస్వామి(Ayyappa Swamy) ఇప్పుడు తెలుగువారికి కూడా ఆరాధ్యదేవుడయ్యాడు. అయ్యప్పమాలను ధరించేవారికి ఎక్కువ శాతం తెలుగువారే ఉండటం ఇందుకు నిదర్శనం. అయితే చాలా మందికి అయ్యప్పస్వామి పుట్టిన రోజు ఎప్పుడనే విషయం తెలియదు. నిజానికి కేరళ పంచాంగాని(Kerala Panchangam)కి మన పంచాగానికి చాలా తేడాలుంటాయి. అయ్యప్పస్వామి పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు జన్మించాడు. ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఇవాళే అన్నమాట! ఈ రోజు అయ్యప్పస్వామి జన్మదిన వేడుకలు కేరళ(Kerala)లో ట్రావెన్కోర్ దేవస్థానం(Travancore Temple) ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో తిరు ఉత్సవం పేరిట పంబ ఆరట్టు(Pamba Arattu) ఉత్సవం నిర్వహిస్తారు. ఇవాళ అయ్యప్పస్వామి ఏనుగుపై కూర్చొని పంబ నదికి వచ్చి అక్కడ స్నానం చేసి తిరిగి సాయంత్రం శబరిమల చేరుకుంటాడట! ఇవాళ రాత్రి పడిపూజ హరిహరాసనం తర్వాత దేవాలయాన్ని మూసేస్తారు.