Sachin Sahoo : అమెరికా పోలీసు కాల్పులలో యూపీకి చెందిన సచిన్ సాహు మృతి
అమెరికా(america) పోలీసుల కాల్పులలో(Police Gun firing) ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ సాహు(Sachin Sahoo) చనిపోయాడు. మహిళను కారుతో ఢీకొట్టిన కేసులో సాహును పోలీసులు కాల్చి చంపారు. శాన్ అంటోనియోలో జరిగిన ఈ ఘటన అక్కడ కలకలం రేపుతోంది. 42 ఏళ్ల సచిన్ సాహుకు అమెరికా పౌరసత్వం ఉండి ఉండవచ్చని అధికారులు అంటున్నారు.
అమెరికా(america) పోలీసుల కాల్పులలో(Police Gun firing) ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ సాహు(Sachin Sahoo) చనిపోయాడు. మహిళను కారుతో ఢీకొట్టిన కేసులో సాహును పోలీసులు కాల్చి చంపారు. శాన్ అంటోనియోలో జరిగిన ఈ ఘటన అక్కడ కలకలం రేపుతోంది. 42 ఏళ్ల సచిన్ సాహుకు అమెరికా పౌరసత్వం ఉండి ఉండవచ్చని అధికారులు అంటున్నారు. మహిళను కారుతో ఢీకొట్టిన(Car accident) కేసులో అరెస్టు చేసేందుకు వచ్చిన ఇద్దరు అధికారులను(Police Offivers) కూడా సాహు కారుతో ఢీకొట్టాడట! దాంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ నెల 21వ తేదీన సాయంత్రం చెవియట్ హైట్స్ దగ్గర ఓ వ్యక్తి మారణాయుధంతో తిరుగుతున్నట్టు శాన్ అంటోనియో పోలీసులకు సమాచారం వచ్చింది. దాంఓ అక్కడికి చేరుకున్న అధికారులు 51ఏళ్ల మహిళను సాహు ఉద్దేశపూర్వకంగానే వాహనంతో ఢీ కొట్టినట్టు గుర్తించారు. మహిళను ఢికొట్టి సాహు అక్కడ్నుంచి పారిపోయాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆమెకు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఆమె సాహు రూమ్‌మేట్ అని గుర్తించారు. పరారీలో ఉన్న సాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. చెవియట్ హైట్స్ దగ్గరే మళ్లీ సాహు తిరుగాడుతున్నాడని తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు అక్కడికి వెళ్లారు. పోలీసులను గమనించిన సాహు ఇద్దరు పోలీసుఅధికారులను వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ అధికారి గాయపడ్డాడు. దీంతో మరో పోలీసు అధికారి కాల్పులు జరపగా, సాహు చనిపోయాడు. గత పదేళ్లుగా సాహు బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని అతడి మాజీ భార్య లీ గోల్డ్ స్టీన్ చెప్పారు. అలాగే స్క్రిజోఫ్రీనియా కు చికిత్స తీసుకుంటున్నాడని, బహుశా మందులు వాడటం మానేసి ఉంటాడని తెలిపారు. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు.