జాతీయ క్రీడా అవార్డులను(National Sports Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఏడాదికి గాను కేంద్రం క్రీడల మంత్రిత్వశాఖ ఈ అవార్డులు పొందిన జాబితాను ప్రకటించింది. 2023కు గాను అత్యున్నత పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు(Major Dhyanchand Khel Award) భారత బ్యాడ్మింటన్‌ జోడి చిరాగ్‌ చంద్రశేఖర్‌శెట్టి(Chandrashekar shetty)-రంకిరెడ్డి సాత్విక్‌(Rankireddy Swathik) సాయిరాజ్‌కు దక్కింది.

జాతీయ క్రీడా అవార్డులను(National Sports Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఏడాదికి గాను కేంద్రం క్రీడల మంత్రిత్వశాఖ ఈ అవార్డులు పొందిన జాబితాను ప్రకటించింది. 2023కు గాను అత్యున్నత పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు(Major Dhyanchand Khel Award) భారత బ్యాడ్మింటన్‌ జోడి చిరాగ్‌ చంద్రశేఖర్‌శెట్టి(Chandrashekar shetty)-రంకిరెడ్డి సాత్విక్‌(Rankireddy Swathik) సాయిరాజ్‌కు దక్కింది. భారత క్రికెటర్‌(Indian Cricketers), స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీకి(Mohammad Shami) అర్జున అవార్డు(Arjun Award) దక్కింది. మరో 25 మందికి కూడా అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌కు అర్జున అవార్డు దక్కింది.

ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్స్‌ అవార్డు దక్కించుకున్న క్రీడాకారులు: వినీత్‌ కుమార్‌ శర్మ–హాకీ, మంజూష కన్వర్‌–బ్యాడ్మింటన్‌, కవితా సెల్వరాజ్‌–కబడ్డీ. ద్రోణాచార్య అవార్డు దక్కిన క్రీడాకారులు: మహవీర్‌ ప్రసాద్‌ సైని –పారా అథ్లెటిక్స్‌, ఆర్‌.బి. రమేశ్‌–చెస్‌, శివేంద్ర సింగ్‌–హాకీ, లిత్‌ కుమార్‌–రెజ్లింగ్‌, గణేష్‌ ప్రభాకర్‌–మల్లఖంబ్‌

అర్జున అవార్డు గ్రహీతలు పొందిన వారు చెస్‌ క్రీడాకారిణి వైశాలి(Vaishali), అంధుల క్రికెట్‌ నుంచి ఇల్లూరి అజయ్‌ కుమార్‌ రెడ్డి, కబడ్డీ ప్లేయర్స్‌ పవన్‌ కుమార్‌, రితూ నేగీ, ఆర్చరీ నుంచి ఒజాస్‌ ప్రవీణ్‌, అదితి గోపీచంద్‌ స్వామి.. పారా అర్చరీ నుంచి శీతల్‌ దేవి, అథ్లెటిక్స్‌ నుంచి శ్రీశంకర్‌, పారుల్‌ చౌదరి బాక్సింగ్‌ నుంచి మహ్మద్‌ హుసాముద్దీన్.. ఈక్వెస్ట్రియన్‌ ప్లేయర్‌ దివ్యకృతి సింగ్‌, గోల్ఫ్‌ నుంచి దీక్షా దగర్‌. హాకీ క్రీడాకారులు కృష్ణ బహదూర్‌, సుశీలా చానులు, ఖో ఖో ఆటగాడు నస్రీన్‌ అర్జున అవార్డు పొందారు. లాన్‌ బౌల్స్‌ నుంచి పింకి, షూటింగ్‌ క్రీడాకారులు ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌, ఈశా సింగ్‌, స్క్వాష్‌ నుంచి హరిందర్‌ పాల్‌ సింగ్‌ సంధూ, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి అహ్యిక ముఖర్జీ, రెజ్లింగ్‌ నుంచి అంతిమ్‌ పంగల్‌, నరోమ్‌ రోషిబినా దేవిలు అర్జున అవార్డులు దక్కాయి. పారా కనోయింగ్‌ ఆడుతున్న ప్రాచి యాదవ్‌కు అర్జున అవార్డులు దక్కాయి.

Updated On 20 Dec 2023 7:37 AM GMT
Ehatv

Ehatv

Next Story