ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఇంఫాల్‌లోని కొంగ్బాలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి కొందరు నిప్పు పెట్టారు. ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్(Manipur)లో మరోసారి హింసాత్మక ఘటనలు(Violence) చోటు చేసుకున్నాయి. తాజాగా ఇంఫాల్(Imphal)లోని కొంగ్బాలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్(Union Minister Rk Ranjan Singh) ఇంటికి కొందరు నిప్పు(Fire) పెట్టారు. ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు.
నా సొంత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. నేను ఇప్పటికీ శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూనే ఉంటాను. ఇలాంటి హింసకు పాల్పడే వ్యక్తులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం అధికారిక పని నిమిత్తం కేరళలో ఉన్నాను. అదృష్టవశాత్తూ గత రాత్రి నా ఇంఫాల్ ఇంటిలో ఎవరూ గాయపడలేదు. దుండగులు పెట్రోల్ బాంబులు(Petrol Bomb) తెచ్చి నా ఇంటి కింది, మొదటి అంతస్తును ధ్వంసం చేశారని రాజ్ కుమార్ రంజన్ సింగ్ పేర్కొన్నారు.
ఇంఫాల్‌లో కర్ఫ్యూ(Curfew) ఉన్నప్పటికీ, జనం మంత్రి ఇంటికి చేరుకున్నారు. మంత్రి నివాసం వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది జనం కంటే ఎక్కువగా ఉన్నారు, కానీ వారు హింసను ఆపడంలో విఫలమయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నెల రోజుల క్రితం కూడా మంత్రి ఇంటిపై దాడికి విఫలయత్నం జరిగింది. అయితే.. భద్రతా సిబ్బంది గుంపును చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు.