నీతి ఆయోగ్(Nithi Ayog) ఎనిమిదో పాలక మండలి సమావేశాన్ని 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రుల నిర్ణయంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మోదీపై నిరసనతో రాష్ట్రాల‌ ప్రజలకు నష్టం కలిగించాలని ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

నీతి ఆయోగ్(Niti Ayog) ఎనిమిదో పాలక మండలి సమావేశాన్ని 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రుల నిర్ణయంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మోదీపై నిరసనతో రాష్ట్రాల‌ ప్రజలకు నష్టం కలిగించాలని ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్(Governor Council) సమావేశాన్ని దాటవేయాలని నిర్ణయించుకున్న ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. తమ రాష్ట్రాల అభివృద్ధిని బహిష్కరిస్తున్నారని అన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో (జీసీఎం) 100కు పైగా అంశాలపై చర్చించామని, ప్రాతినిథ్యం లేని రాష్ట్రాల ప్రజలు నష్టపోతారని అన్నారు.

రవిశంకర్(Ravishankar) మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి, ప్రణాళికలకు నీతి ఆయోగ్ చాలా ముఖ్యమని.. ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి రాక‌పోవ‌డ‌మంటే.. తమ రాష్ట్రాల‌ ప్రజల గొంతుకను ఇక్కడికి తీసుకురాక‌పోవ‌డ‌మేన‌న్నారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. కీల‌క‌ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలను గ్రౌండ్ లెవ‌ల్లో అమలు చేస్తారు. ఇంత జరుగుతున్నా.. ఆ ముఖ్యమంత్రులు ఎందుకు రావడం లేదు? మోదీకి వ్యతిరేకంగా ఎంత దూరం వెళ్తారు? ముఖ్యమంత్రులు తమ‌ రాష్ట్రాల‌ ప్రజలకు ఎందుకు నష్టం చేస్తున్నారు? అని రవిశంకర్ ప్రసాద్ ప్ర‌శ్నించారు.

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన 8 మంది ముఖ్యమంత్రులలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కేరళ సీఎం కర్ణాటక ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఎంతో గందరగోళం తర్వాత శుక్రవారం అర్థరాత్రి సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.

Updated On 27 May 2023 3:24 AM GMT
Ehatv

Ehatv

Next Story