సిమ్ కార్డుల(Sim Card) జారీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను పెద్దమొత్తంలో విక్రయించేందుకు సిమ్ డీలర్ల పోలీస్ వెరిఫికేషన్(Police verification) తప్పనిసరి చేసినట్లు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini vaishnav) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల.. నకిలీ సిమ్ కార్డ్‌ల అమ్మకానికి.. ఒకే పేరు లేదా ఐడీపై ఎక్కువ సిమ్ కార్డ్‌ల విక్రయాలకు చెక్ పడనుంది. దీని వల్ల స్పామింగ్‌ను కూడా అరికట్టవచ్చని బావిస్తుంది. కొత్త సిమ్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

Telecom Minister Ashwini vaishnav
సిమ్ కార్డుల(Sim Card) జారీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను పెద్దమొత్తంలో విక్రయించేందుకు సిమ్ డీలర్ల పోలీస్ వెరిఫికేషన్(Police verification) తప్పనిసరి చేసినట్లు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini vaishnaw) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల.. నకిలీ సిమ్ కార్డ్‌ల అమ్మకానికి.. ఒకే పేరు లేదా ఐడీపై ఎక్కువ సిమ్ కార్డ్‌ల విక్రయాలకు చెక్ పడనుంది. దీని వల్ల స్పామింగ్‌ను కూడా అరికట్టవచ్చని బావిస్తుంది. కొత్త సిమ్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
దేశంలో ప్రతిరోజూ సిమ్ కార్డు మోసాలు(Sim Card Fraud) వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆధార్ కార్డు దుర్వినియోగంతో చేస్తున్న మోసాలను పోలీసులు ఛేదించారు. ఒకే ఆధార్ కార్డుపై 658 సిమ్ కార్డులు జారీ చేశారని.. ఈ సిమ్ కార్డులన్నీ వినియోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.
తమిళనాడులోని సైబర్ క్రైమ్ వింగ్ ఈ వారం ఒక వ్యక్తి నుండి ఒకే ఆధార్ నంబర్‌పై 100-150 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. గత నాలుగు నెలల్లో తమిళనాడులోని సైబర్ క్రైమ్ వింగ్ తమిళనాడు వ్యాప్తంగా 25,135 సిమ్ కార్డుల ద్వారా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుమానిస్తూ బ్లాక్ చేసింది.
విజయవాడలో మరో కేసులో ఒకే ఫొటోతో 658 సిమ్ కార్డులు జారీ చేశారు. సిమ్ కార్డులు కొనుగోలు చేసే మొబైల్ దుకాణాలలో సిమ్‌లు పంపిణీ చేసే పోలుకొండ నవీన్ పేరుపై అన్ని సిమ్ కార్డులు రిజిస్టర్ చేయబడ్డాయి. అన్ని సిమ్‌లను బ్లాక్ చేయాలని సంబంధిత టెలికాం కంపెనీని పోలీసులు ఆదేశించారు.
