పశ్చిమ బెంగాల్(West Bangal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Benarjee)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దీదీ బెంగాల్ ప్రజల కోసం పని చేయద‌ని అన్నారు. ఆమె లక్ష్యం బెంగాల్ ప్రజల సంక్షేమం కాదు. మేనల్లుడును ముఖ్యమంత్రిని చేయడమే ఆమె లక్ష్యం. వచ్చే నెలలో గ్రామీణ ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో సంస్థాగత యంత్రాంగాన్ని బలోపేతం చేయడమే అమిత్ షా పర్యటన లక్ష్యంగా తెలుస్తోంది. దీదీ పాలనలో బెంగాల్ బాంబు పేలుళ్ల కేంద్రంగా […]

పశ్చిమ బెంగాల్(West Bangal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Benarjee)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దీదీ బెంగాల్ ప్రజల కోసం పని చేయద‌ని అన్నారు. ఆమె లక్ష్యం బెంగాల్ ప్రజల సంక్షేమం కాదు. మేనల్లుడును ముఖ్యమంత్రిని చేయడమే ఆమె లక్ష్యం. వచ్చే నెలలో గ్రామీణ ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో సంస్థాగత యంత్రాంగాన్ని బలోపేతం చేయడమే అమిత్ షా పర్యటన లక్ష్యంగా తెలుస్తోంది.

దీదీ పాలనలో బెంగాల్ బాంబు పేలుళ్ల కేంద్రంగా మారిందని కేంద్ర హోంమంత్రి అన్నారు. తాజాగా బీర్భూమ్‌లో 80 వేలకు పైగా డిటోనేటర్లు, 27 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఎన్‌ఐఏ పట్టుకుని ఉండకపోతే బాంబు పేలుళ్లలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారో లెక్కేలేదని అన్నారు.

అమిత్ షా మధ్యాహ్నం 12:40 గంటలకు పశ్చిమ్ బర్ధమాన్‌లోని ఆండాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్, పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సుభేందు అధికారి, ఇతర సీనియర్ బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు.

రాష్ట్ర బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు మాట్లాడుతూ, “అమిత్ షా మధ్యాహ్నం బీర్‌భమ్‌లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆయన సూరిలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆయన సాయంత్రం తర్వాత నగరానికి వచ్చి దక్షిణేశ్వర్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ” సాయంత్రం రాష్ట్ర పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి సంస్థాగత పరిస్థితిని సమీక్షించనున్నారని పేర్కొన్నారు.

Updated On 14 April 2023 7:52 AM GMT
Yagnik

Yagnik

Next Story