నోట్ల రద్దు(Demonitisation) తర్వాత దేశంలో డిజిటిల్ పేమెంట్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గప్‌చుప్ బండి దగ్గరి నుంచి పెద్దపెద్ద మాల్స్ వరకు లావాదేవీలు జరిపేందుకు యూపీఐ పేమెంట్స్(UPI Payments) మీద ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి. ప్రతీ వినియోగదారుడి వద్ద ప్రస్తుతం గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(Phone Pay), పేటీఎం(Paytm) ఇంకా రకరకాల డిజిటల్ పేమెంట్ యాప్స్ ఉన్నాయి. వారివారి బ్యాంకు ఖాతాలతో యూపీఐ ఐడీలను అనుసంధానించి పేమెంట్స్‌ కొనసాగిస్తున్నారు

నోట్ల రద్దు(Demonitisation) తర్వాత దేశంలో డిజిటిల్ పేమెంట్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గప్‌చుప్ బండి దగ్గరి నుంచి పెద్దపెద్ద మాల్స్ వరకు లావాదేవీలు జరిపేందుకు యూపీఐ పేమెంట్స్(UPI Payments) మీద ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి. ప్రతీ వినియోగదారుడి వద్ద ప్రస్తుతం గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(Phone Pay), పేటీఎం(Paytm) ఇంకా రకరకాల డిజిటల్ పేమెంట్ యాప్స్ ఉన్నాయి. వారివారి బ్యాంకు ఖాతాలతో యూపీఐ ఐడీలను అనుసంధానించి పేమెంట్స్‌ కొనసాగిస్తున్నారు.

అయితే ఒక ఏడాది వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్‌ చేయని యూపీఐ ఐడీలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి యాక్టివ్‌ లేని యూపీఐ ఐడీలపై లావాదేవీలను నిలిపివేయాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆదేశాల మేరకు వీటిని డీయాక్టివ్‌ చేయాలని నిర్ణయించారు. కొత్త నెంబర్లకు మారినప్పుడు బ్యాంకు(Bank) ఖాతాలతో అనుసంధానం చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎలాంటి తప్పుడు ట్రాన్సాక్షన్లు జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది. కొత్త నెంబర్లు అప్డేట్ చేసుకోకుంటే ఇనాక్టివ్ యూపీఐ ఐడీలతో మోసాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ట్రాయ్ ప్రకారం..ఏదైనా ఫోన్‌ నెంబర్‌ డీయాక్టివేట్‌ అయిన తర్వాత 90 రోజులకు అదే ఫోన్‌ నెంబర్‌ను కొత్త కస్టమర్‌కి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెంబర్‌ మరో వ్యక్తికి కేటాయించడంతో నగదు లావాదేవీలు జరిగే ప్రమాదం ఉందని ఎన్‌పీసీఐ తెలిపింది. దీంతో కారణంగా థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్స్, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా డిసెంబర్ 31, 2023లోపు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంతో పాటు ఇతర యూపీఐ పేమెంట్ యాప్స్‌ వినియోగిస్తున్నవారు తమ యూపీఐ ఐడీలు యాక్టివేట్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని... గత ఏడాదిగా ట్రాన్సాక్షన్లు చేశారో లేదో చూసుకోవాలని అంటున్నారు. అంతేకాకుండా తమ యూపీఐ ఐడీలకు లింకైన ఫోన్‌ నెంబర్లను సైతం తనిఖీ చేసుకోవాలని.. కొత్త నెంబర్‌కు మారినప్పుడు పాత దానిని యూపీఐ ఐడీల నుంచి తొలగించామా లేదా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Updated On 29 Dec 2023 7:29 AM GMT
Ehatv

Ehatv

Next Story