పని ఒత్తిడిని(Work stress) తట్టుకోలేక చార్టెట్ అకౌంటెంట్‌(chartered accountant) అన్నా సెబాస్టియన్‌(Anna Sebastian) పెరయిల్ చనిపోయిన విషయం తెలిసిందే!

పని ఒత్తిడిని(Work stress) తట్టుకోలేక చార్టెట్ అకౌంటెంట్‌(chartered accountant) అన్నా సెబాస్టియన్‌(Anna Sebastian) పెరయిల్ చనిపోయిన విషయం తెలిసిందే! ఆమె మృతి పట్ల కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala sitaraman) అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దేవుడి(God) కృపతోనే ఒత్తిడిని జయించవచ్చు అంటూ నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.

చెన్నై మెడికల్‌ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నిర్మలా సీతారామన్‌ అక్కడ ఈ మాటలు మాట్లాడారు. 'మన పిల్లలు విద్య కోసం కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి అద్భుతంగా బయటకు వస్తారు. సీఏ(CA) చదివి ఓ సంస్థలో పని చేస్తున్న మహిళ పని ఒత్తిడిని తట్టుకోలేక మరణించినట్టు రెండుమూడు రోజుల క్రితం మాకు వార్త వచ్చింది. మీరు ఏం చదివినా, ఏ ఉద్యోగం చేసినా ఒత్తిడిని తట్టుకునే మనోబలం ఉండాలి. దైవత్వంతోనే దీనిని సాధించవచ్చు. దేవుడిపై విశ్వాసాన్ని ఉంచండి. దీని ద్వారా మీ ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి పెరిగేతే మనోబలం సాధించవచ్చు’ అని ఉపన్యసించారామె! విద్యాసంస్థలు దైవత్వాన్ని, ఆధ్యాత్మికతను తీసుకురావాలని, అప్పుడే మన పిల్లలకు మనోబలం వస్తుందని, ఇదే వారి పురోగతికి, దేశ పురోగతికి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు కేంద్ర ఆర్ధిక మంత్రి. నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఘాటుగా స్పందించారు. 'సంక్లిష్టమైన చార్టెడ్‌ అకౌంటెన్సీని పూర్తి చేశారంటేనే ఒత్తిడిని ఎదుర్కొనే మనోబలం అన్నాకు ఉందని అర్థమవుతోంది. ఆమె ప్రాణాలు తీసిన విషపూరితమైన పని సంస్కృతి, అధిక పని గంటల గురించి మాట్లాడాలి. బాధితురాలిని నిందించడం ఆపండి' అంటూ ఎక్స్‌లో నిర్మలా సీతారామన్‌ను తిట్టిపోశారు. మరోవైపు దేశవ్యాప్తంగా కార్మికుల రోజూవారీ కష్టాలను నిర్మల అవమానిస్తున్నారని సీపీఐ ఎంపీ సంతోష్‌ కుమార్‌ విమర్శించారు. అన్నా మరణానికి కారణమైన సమస్యలపై మాట్లాడకుండా దేవుడిని నమ్ముకోండని సలహా ఇవ్వడం వింతగా ఉందన్నారు. . నెటిజన్లు కూడా నిర్మల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నారు. తను చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్‌ అవుతున్నాయని తెలుసుకున్న నిర్మలా సీతారామన్‌ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాధితురాలిని నిందించడం తన ఉద్దేశం కాదన్నారు. తాను ఎవరి పేర్లూ తీసుకోలేదన్నారు. తాను మాట్లాడిన యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకుల కోసం ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారని, విద్యార్థుల మనోబలం పెంచుకోవడానికి ఇది ఎంత అవసరమనే దాని గురించే తాను మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు నిర్మలా సీతారామన్‌.

Eha Tv

Eha Tv

Next Story