- కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు
- రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.. 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
- పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
- బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు
- కంది, మినుములు, మసూర్‌లను కొనుగోలు చేయనున్న కేంద్రం
- పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం
- అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మీషన్
- 2024 జులై నుంచి వందకు పైగా అధికోత్పత్తి వంగడాలు విడుదల
- పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్
- త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్
- గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి
- పదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపు
- ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించింది..
- యూరియా ఉత్పత్తిలో స్వయంసమృద్ధికి కొత్త కర్మాగారాలు
- ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పది సూత్రాల్లో రెండోది ఎంఎస్ఎంఈ రంగం
- ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం
- ఎంఎస్ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు
- 27 రంగాల్లో స్టార్టప్‍లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ
- నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డు
- సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
- ఎంఎస్ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు
- ఎంఎస్‌ఎంఈలకిచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు
- స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు
- బొమ్మల తయారీలో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపేలా ప్రత్యేక కార్యక్రమం
- మేడిన్ ఇండియా బ్రాండ్ కింద బొమ్మల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహం..