World Book Day : ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం(Kandukuri Veereshalingam). ఒక పుస్తకానికి ఉండే విలువ అలాంటిది మరి. ఒక పుస్తకాన్ని(Book) మొదటిసారి చదివితే కొత్త స్నేహితున్ని సంపాదించుకున్నట్లుంటుంది. రెండోసారి ఆ పుస్తకాన్ని చదివితే పాత స్నేహితున్ని కలిసిన ఆనందం కలుగుతుందని ప్రముఖ రచయిత గ్లాడ్స్ అన్నారు. నిజమే పుస్తకాలు మనకు మంచి నేస్తాలు.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం(Kandukuri Veereshalingam). ఒక పుస్తకానికి ఉండే విలువ అలాంటిది మరి. ఒక పుస్తకాన్ని(Book) మొదటిసారి చదివితే కొత్త స్నేహితున్ని సంపాదించుకున్నట్లుంటుంది. రెండోసారి ఆ పుస్తకాన్ని చదివితే పాత స్నేహితున్ని కలిసిన ఆనందం కలుగుతుందని ప్రముఖ రచయిత గ్లాడ్స్ అన్నారు. నిజమే పుస్తకాలు మనకు మంచి నేస్తాలు. అవును ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ప్రతి దానికి ఒక రోజు ఉన్నట్లే పుస్తకానికీ ఒక రోజు ఉందండోయ్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని(World Book Day) జరుపుకొంటారు. చదవటం, రాయడం, ప్రచురించడం, కాపీరైట్స్ వీటన్నింటినీ ప్రోత్సహించడం కోసం ప్రతి ఏటా యునెస్కో(UNESCO) ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. యునెస్కో 1995లో ప్యారిస్(Paris) సమావేశంలో పుస్తకాలను, రచయితలను గౌరవించడానికి ఈ రోజును ఏర్పాటు చేసింది. యువతను చదువు వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ పుస్తక దినోత్సవాన్ని జరుపుతోంది. పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానం లభిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. మీరు పుస్తకాల పురుగులైతే అదృష్టవంతులే. కాకున్నా మరేం మించిపోలేదు. ఇప్పటి నుంచైనా పుస్తకాలను చదవటం అలావాటుగా చేసుకోండి. ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలంటే పుస్తకాన్ని మించిన బహుమతి ఉండదు. మీకు నచ్చిన పుస్తకాలను మీ స్నేహితులు, బంధువులతోనూ పంచుకోండి.