ప్రముఖ కవి, చిత్రకారుడు, కళాకారుడు ఇమ్రోజ్(Imroz) కన్నుమూశారు. నిన్ను మళ్లీ కలుసుకుంటాను అని చెప్పిన తన సహచరి అమృతా పీతంను(Amrita Pritam) వెతుక్కుంటూ వెళ్లిపోయారు. ఎప్పుడు, ఎక్కడ అన్నది చెప్పకుండా తనను ఒంటరిచేసి వెళ్లిపోయిన అమృత కోసం 97 ఏళ్ల వయసులో స్వర్గదారులను అన్వేషిస్తూ వెళ్లిపోయారు ఇమ్రోజ్ అనబడే ఇంద్రజిత్. అమృతా ప్రీతమ్, సాహిర్ లూధియాన్వీ, ఇమ్రోజ్‌లది ఓ ముక్కోణపు ప్రేమ కథ(Love story). అమృతకేమో సాహిర్(Sahir) అంటే పిచ్చి ప్రేమ. ఇమ్రోజ్‌కేమో అమృత అంటే చచ్చేంత ఇష్టం.
ప్రముఖ కవి, చిత్రకారుడు, కళాకారుడు ఇమ్రోజ్(Imroz) కన్నుమూశారు. నిన్ను మళ్లీ కలుసుకుంటాను అని చెప్పిన తన సహచరి అమృతా పీతంను(Amrita Pritam) వెతుక్కుంటూ వెళ్లిపోయారు. ఎప్పుడు, ఎక్కడ అన్నది చెప్పకుండా తనను ఒంటరిచేసి వెళ్లిపోయిన అమృత కోసం 97 ఏళ్ల వయసులో స్వర్గదారులను అన్వేషిస్తూ వెళ్లిపోయారు ఇమ్రోజ్ అనబడే ఇంద్రజిత్. అమృతా ప్రీతమ్, సాహిర్ లూధియాన్వీ, ఇమ్రోజ్‌లది ఓ ముక్కోణపు ప్రేమ కథ(Love story). అమృతకేమో సాహిర్(Sahir) అంటే పిచ్చి ప్రేమ. ఇమ్రోజ్‌కేమో అమృత అంటే చచ్చేంత ఇష్టం. సాహిర్ కాదన్న అమృతను ఇమ్రోజ్ పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. సాహిర్‌పై ఆమెకు ఉన్న పిచ్చి ప్రేమను తనూ ఇష్టపడ్డాడు. చివరి వరకు అమృత చేయి వదలకుండా చూసుకున్నాడు.
బొంబాయిలో ఉన్న సాహిర్ లూథియాన్వీకి ఢిల్లీలో ఉన్న అమృతా ప్రీతమ్ ఓ ఉత్తరం రాసింది. సాహిర్‌కు రాసిన అఖ్రీ ఖత్ (చివరి ఉత్తరం) అదే! రాసింది సాహిర్‌కే అయినా ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసే ధైర్యం చేయలేకపోయింది. వారిద్దరి మధ్యన ఉన్న సుదీర్ఘ మూగప్రేమకు అది ముక్తాయింపు వాక్యం. అది బయటకు చెప్పుకోడానికి ధైర్యం సరిపోక ఉత్తరం మీద ఉన్న సాహిర్ పేరును చెరిపేసి ఓ మామూలు రచనగా పత్రికకు పంపింది అమృత. చిత్రమేమిటంటే ఆ రచనకు చిత్రం గీసిన చిత్రకారుడు ఇంద్రజిత్(Inderjeet) ఆ తర్వాతి కాలంలో ఆమె జీవన సహచరుడు కావడం! మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఆ ఉత్తరం రాశారో చెబితే నాకు బొమ్మ వేయడం తేలిక అవుతుందని అని అమృతను ఫోన్ చేసి అడిగినప్పుడు ఆమె దాపరికం లేకుండా సాహిర్ పేరు చెప్పింది. ఇమ్రోజ్‌తో కలిసి ఉన్నంత కాలం సాహిర్ పేరు చెబుతూనే వచ్చింది. ఇమ్రోజ్ ఆమెతో పాటు ఆమె ప్రేమను స్వీకరించాడు. సాహిర్ ప్రేమలో పడక ముందు ఆమె భర్తతో విడిపోయింది. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా! సాహిర్‌కు కూడా అమృత అంటే ఇష్టమే అయినా ఎందుకో ధైర్యం చేయలేదు. ఇంద్రజిత్ అనే ఇమ్రోజ్ మాత్రం ధైర్యం చేశాడు. అమృతతో పాటు ఇద్దరు పిల్లలను స్వీకరించాడు. అప్పట్లో ఎవరూ ఊహించని, ఎవరూ సాహసించని సహ జీవనానికి ఆమెకు తోడుగా నిలిచాడు. సాహిర్‌కు చివరి ఉత్తరం రాసినట్టుగానే, తాను చనిపోయే ముందు ఇంద్రజిత్‌ను ఉద్దేశించి 'మై తుమ్హే ఫిర్ మిలూంగి' (నేను తిరిగి నిన్న కలుస్తాను) అనే సుప్రసిద్ధ కవిత రాసింది. అందుకు బదులుగా ఆమె జ్ఞాపకాలతో ఇమ్రోజ్ తుదిశ్వాస విడిచేంత వరకు కవితలు రాస్తూనే వచ్చాడు.