Ohio Indian Crime : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో(America) భారతీయ విద్యార్థులు(Indian students) వరుసగా చనిపోతున్నారు. తాజాగా ఓహియాలో(Ohia) ఓ స్టూడెంట్ చనిపోయాడు. న్యూయార్క్‌లో(Newyork) ఉన్న ఇండియన్ కౌన్సులేట్ ఈ విషయాన్ని చెబుతూ ఆ విద్యార్థి మరణంపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపింది.

Ohio Indian Crime
అగ్రరాజ్యం అమెరికాలో(America) భారతీయ విద్యార్థులు(Indian students) వరుసగా చనిపోతున్నారు. తాజాగా ఓహియాలో(Ohia) ఓ స్టూడెంట్ చనిపోయాడు. న్యూయార్క్‌లో(Newyork) ఉన్న ఇండియన్ కౌన్సులేట్ ఈ విషయాన్ని చెబుతూ ఆ విద్యార్థి మరణంపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపింది. ఉమా సత్యసాయి(Uma sathyasai) అనే ఆ విద్యార్థి క్లీవ్‌లాండ్‌లో(Cleveland) చదువుకుంటున్నాడు. సత్యసాయి భౌతికకాయాన్ని భారత్‌కు తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కౌన్సులేట్ అధికారులు తెలిపారు. అమెరికాలో ఈ ఏడాది భారతీయ విద్యార్థుల మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికే పదికి చేరుకున్నది. గత నెలలో క్లీవ్‌లాండ్‌లోనే భారతీయ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ అదృశ్యం అయ్యాడు. అతడిని కిడ్నాప్ చేసిన దుండగులు అతడి కుటుంబానికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు.
