అయోధ్య(Ayodhya) రామమందిరం(Ram mandir) కోసం ఉద్యమాలు చేసినవారిలో బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి కూడా ఒకరు. బాబ్రీమసీదు(Babri masjid) కూల్చివేత కేసులో ఆమెపై సీబీఐ కేసు(CBI case) కూడా నమోదైంది. 2020లో ఉమాభారతి సహా బీజేపీ(BJP) నేతలు అద్వానీ, జోషిని నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

Uma Bharathi
అయోధ్య(Ayodhya) రామమందిరం(Ram mandir) కోసం ఉద్యమాలు చేసినవారిలో బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి కూడా ఒకరు. బాబ్రీమసీదు(Babri masjid) కూల్చివేత కేసులో ఆమెపై సీబీఐ కేసు(CBI case) కూడా నమోదైంది. 2020లో ఉమాభారతి సహా బీజేపీ(BJP) నేతలు అద్వానీ, జోషిని నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఉమాభారతి(Uma Bharathi) ఈరోజు అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్టకు హాజరయ్యారు. ఆలయ ఉద్యమంలో అగ్ర నేతలుగా ఉన్న ఫైర్ బ్రాండ్ బీజేపీ నాయకురాలు ఉమాభారతికి ఉద్యమానికి చెందిన మరో ప్రముఖ మహిళా నాయకురాలు సాధ్వి రితంభరను ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా తన ఫొటోలను ఉమాభారతి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమయం కోసమే వేచి చూస్తున్నానని ఆమె తెలిపారు.
