గత ఏడాది రికార్డు స్థాయిలో u. S వీసా అప్లికేషన్స్ రావటం తో ప్రాసెసింగ్ విషయాల్లో,వీసా జారీ చేసే సమయం లో ,వీసా ఇంటర్వ్యూలు లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జాప్యం జరిగింది. వీసా ఇంటర్వ్యూ, రెన్యువల్, కోసం చాలామందికి నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎదుర్కోకుండా యూఎస్ కాన్సులేట్ఇండియాలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.కాన్సులేట్ లో నలుగురు యూఎస్ అధికారులని నియమించాలనే నిర్ణయం కూడా తీసుకుంది. గత ఏడాది కన్నా […]

గత ఏడాది రికార్డు స్థాయిలో u. S వీసా అప్లికేషన్స్ రావటం తో ప్రాసెసింగ్ విషయాల్లో,వీసా జారీ చేసే సమయం లో ,వీసా ఇంటర్వ్యూలు లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జాప్యం జరిగింది. వీసా ఇంటర్వ్యూ, రెన్యువల్, కోసం చాలామందికి నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎదుర్కోకుండా యూఎస్ కాన్సులేట్ఇండియాలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.కాన్సులేట్ లో నలుగురు యూఎస్ అధికారులని నియమించాలనే నిర్ణయం కూడా తీసుకుంది.

గత ఏడాది కన్నా ఎక్కువగా ఈ ఏడాది వీసాలుఎక్కువగా ప్రాసెసింగ్ చేయబడతాయని ముందుగా ఊహించిన యుఎస్ కాన్సులేట్ ఈసారి వీసాల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగానే డ్రాప్ బాక్స్ ఆప్షన్ కూడా తీసుకువచ్చింది..వీసా కోసం నెలల తరబడి వెయిట్ చేయకుండా ఉండడానికి ఇంటి నుంచి మెయిల్ ద్వారా తమ వీసా ప్రాసెసింగ్ అప్లై చేసుకునే విధానం డ్రాప్ బాక్స్ ద్వారా కలిగించింది.

యుఎస్ కాన్సులేట్ భవనాన్నిమన హైదరాబాద్లో మార్చి 20 నుంచి నానక్ రామ్ గూడ లో ప్రారంభం కాబోతుంది..340 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన యుఎస్ కాన్సులేట్ ప్రారంభం ప్రతిష్టాత్మకంగా జరగనుంది అమెరికా భారత్ మధ్యభాగస్వామ్య ఒప్పందాలు మరింత బలపడనున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం . కొత్త కార్యాలయం మొదలుఅయ్యే సందర్భంలో వచ్చే మార్పుల కోసం కొన్నిరోజులు బేగంపేట్‌, ప్యాలెస్ లో మార్చి 15, మధ్యాహనం 12:00 గంటల నుండి మార్చి 20 ఉదయం 08:30 గంటల వరకు ప్రజల కోసం కాన్సులేట్ మూసివేయబడుతుంది.

బయోమెట్రిక్స్ అపాయింట్‌మెంట్‌లు, “డ్రాప్‌బాక్స్” అపాయింట్‌మెంట్‌లు , పాస్‌పోర్ట్ పికప్‌ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాధాపూర్, హైదరాబాద్‌ లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ (VAC)లో కొనసాగుతాయి.

మార్చి 15 వరకు వీసా ఇంటర్వ్యూ ఉన్న దరఖాస్తుదారులు బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్ కి వెళ్లగలరని గమనించాలి . మార్చి 23 నుండి, వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ కోసం నానక్‌రామ్‌గూడలోని నూతన కార్యాలయానికివెళ్ళవల్సివుంటుంది . కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు అని గమనించాలి .

వీసా సేవలకి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే, +91 120 4844644 లేదా +91 22 62011000 నంబర్లకు సంప్రదించండి.

Updated On 8 March 2023 12:19 AM GMT
Ehatv

Ehatv

Next Story