Global Boiling Era : భూగోళం మండిపోతున్నది... భయంకరమైన విపత్తు ముంచుకోస్తోంది..!
సాధారణంగా జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం 17 డిగ్రీలకు పెరిగింది. లక్షా ఇరవై వేల ఏళ్ల సంవత్సరాలలో భూమి ఇంతగా ఎప్పుడూ వేడెక్కలేదు. విపరీత వేడి కారణంగా మంచు కరిగి వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. చైనా, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా ఈశాన్య ప్రాంతాలు, జపాన్, భారత్, పాకిస్తాన్‌లలో ఆకస్మిక వరదలు అల్లకల్లోలం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎడారి ప్రాంతాలలో పగటి పూట ఉష్ణోగ్రతతో పోలిస్తే రాత్రుళ్లు కాసింత తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ వాతావరణం చల్లబడతుంది. ఆందోళన కలిగించే విషయమేమింటే కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం. అక్కడ వేసవిలో మనుషులు ఉండలేరు. అంత భయంకరమైన వేడి ఉంటుంది. ఈసారి జూలైలో అక్కడ మామూలు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే చైనాలోని వాయవ్య ప్రాంతాలలో రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉత్తరార్థ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
భూమికి కాలం చెల్లింది. ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. శీతల దేశాల్లో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. అడవులు దగ్ధమవుతున్నాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు మంచును కరిగిస్తున్నాయి. ఫలితంగా సముద్రమట్టం పెరుగుతోంది. నగరాలు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఓ పక్క భారీ వర్షాలు, వదరలు .. మరోపక్క సెగలు కక్కుతున్న సూర్యుడు. వెరసి భూగోళం ఇకపై మండే అగ్నిగోళంగామారబోతున్నది. గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిపోయిందని, ఇక గ్లోబల్ బాయిలింగ్ శకం(global boiling Era) వచ్చేసిందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితినే ఆందోళన వ్యక్తం చేస్తున్నదంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి.
సాధారణంగా జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం 17 డిగ్రీలకు పెరిగింది. లక్షా ఇరవై వేల ఏళ్ల సంవత్సరాలలో భూమి ఇంతగా ఎప్పుడూ వేడెక్కలేదు. విపరీత వేడి కారణంగా మంచు కరిగి వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. చైనా(china), దక్షిణ కొరియా(South Korea), బ్రెజిల్(Brazil), అమెరికా(America) ఈశాన్య ప్రాంతాలు, జపాన్(Japan), భారత్(Bharath), పాకిస్తాన్‌లలో(Pakistan) ఆకస్మిక వరదలు అల్లకల్లోలం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎడారి ప్రాంతాలలో పగటి పూట ఉష్ణోగ్రతతో పోలిస్తే రాత్రుళ్లు కాసింత తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ వాతావరణం చల్లబడతుంది. ఆందోళన కలిగించే విషయమేమింటే కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం. అక్కడ వేసవిలో మనుషులు ఉండలేరు. అంత భయంకరమైన వేడి ఉంటుంది. ఈసారి జూలైలో అక్కడ మామూలు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే చైనాలోని వాయవ్య ప్రాంతాలలో రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉత్తరార్థ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఈ వేసవిలో వడగాలులు ఎంతో మంది ప్రాణాలు తీశాయి. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్ దేశాలను వడగాలులు ఉక్కిరి బిక్కిరిచేశాయి. ఆ వేడిని తట్టుకోలేక జనం అల్లాడిపోయారు. వడగాడ్పుల కారణంగా అంటార్కిటికాలో పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియా దేశాలు మొన్నటి స్ప్రింగ్ సీజన్ నుంచి, అంటే వసంతకాలం చివరి నుంచి అత్యధిక వేడిని ఎదుర్కొన్నాయి. ఈ విషయం యూరోపియన్ కోపర్నికస్ నివేదిక చెబుతోంది. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలలో క్రమం తప్పకుండా 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నివేదిక చెబుతోంది. గ్రీస్, ఇటలీ, క్రొయేషియా, అల్జీరియా, కెనడాలో అడవులు అంటుకున్నాయి.
కార్చిచ్చుల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలలో కాలుష్యం పెరిగింది. నాడాలో ఏకంగా నాలుగు వారాలలో 46 వేల చదరపు మైళ్ల అడవులు బూడిదయ్యాయి. ప్రపంచంలోని దాదాపు 60 శాతం దేశాలలో అడవులు దగ్ధమయ్యాయి.
ప్రకృతి ఇలా ప్రకోపించడం వల్ల ప్రపంచం భూభాగంలో దాదాపు మూడో వంతు కరువు కాటకాలు సంభవిస్తాయని, లక్షలాది మంది ఆకలితో కన్నుమూస్తారని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది చివరితో పాటు వచ్చే ఏడాదిలో ఎల్‌నినో ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ఫలితంగా బ్రిటన్, ఐర్లాండ్, బాల్టిక్ సముద్రం, జపాన్ సముద్రం, పసిఫిక్, పశ్చిమ హిందూ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు అంటున్నారు.