పీకల్దాక మద్యం(alcohol) సేవించిన ముగ్గురు యువతులు ఆ మత్తులో నానా బీభత్సం సృష్టించారు. ముంబాయ్‌ (Mumbai)దగ్గరలో ఉన్న విరార్‌(Virar) ప్రాంతంలో అర్థరాత్రి ఈ యువతులు వీరంగం వేశారు. వికృత చేష్టలతో స్థానికులను ఇబ్బంది పెట్టారు.

పీకల్దాక మద్యం(alcohol) సేవించిన ముగ్గురు యువతులు ఆ మత్తులో నానా బీభత్సం సృష్టించారు. ముంబాయ్‌ (Mumbai)దగ్గరలో ఉన్న విరార్‌(Virar) ప్రాంతంలో అర్థరాత్రి ఈ యువతులు వీరంగం వేశారు. వికృత చేష్టలతో స్థానికులను ఇబ్బంది పెట్టారు. అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసులు వచ్చి వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై దాడికి దిగారు. ఓ యువతి అయితే ఇన్‌స్పెక్టర్‌ కాలర్‌ పట్టుకుంది. దుర్భాషలాడింది. ఒకరేమో కానిస్టేబుల్‌ చేతిని కొరికి గాయపరచింది. పోలీసులు అతి కష్టం మీద ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకోగలిగారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 353, 323, 325, 504, 506 కింద కేసు నమోదు చేశారు. తర్వాత ఆ ముగ్గురిని కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Updated On 10 May 2024 3:14 AM GMT
Ehatv

Ehatv

Next Story