ఎందుకో తెలియదు కానీ పెళ్లిళ్లకు సంబంధించిన విచిత్రమైన సంఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోనే జరగుతుంటాయి. లేటెస్ట్‌గా రెండు పెళ్లిళ్లు జరగాల్సిన చోట ఒక పెళ్లి జరిగింది. అలా ఎందుకు జరిగిందో? కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం! ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్(Firozabad)లో జస్రానా(Jasrana) అనే గ్రామం ఉంది.
ఎందుకో తెలియదు కానీ పెళ్లిళ్లకు సంబంధించిన విచిత్రమైన సంఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోనే జరగుతుంటాయి. లేటెస్ట్‌గా రెండు పెళ్లిళ్లు జరగాల్సిన చోట ఒక పెళ్లి జరిగింది. అలా ఎందుకు జరిగిందో? కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం! ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్(Firozabad)లో జస్రానా(Jasrana) అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రాధేశ్యామ్ రాజ్‌పుత్(Radheshyam Rajput) అనే ఓ పెద్దాయన ఒకే ముహూర్తానికి తన ఇద్దరు కూతుళ్లకు వివాహం తలపెట్టారు. పెళ్లి వేడుకలో భాగంగా ఇద్దరు వరుల తరుపు వారు సోమవారం రాత్రి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ ఇద్దరు పెళ్లికొడుకులకు స్వాగతం పలుకుతూ పెళ్లికూతుళ్లు వారి మెడలో వరమాలలు కూడా వేశారు. అయితే ఇందులో రాయపూర్(Raipur) నుంచి వచ్చిన మగపెళ్లివారికి, వధువు తరపువారికి డాన్స్ చేయడం విషయంలో గొడవ మొదలయ్యింది. కాసేపటికే వివాదం పెద్దదయ్యింది. చివరకు పరస్పరం కొట్టుకునేవారకు వెళ్లింది. దీంతో ఒక వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని గట్టిగా చెప్పేసింది. వరుడి తరపు వారు తమవారిపై చేయి చేసుకున్నారని, ఇద్దరికి గాయాలయ్యాయని, అందుకే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లి కూతురు చెప్పింది. ఈ గొడవ జస్రానా పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు కల్యాణమండపానికి వచ్చి ఇరుపక్షాల వారిని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పెళ్లికూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆమె మాత్రం పెళ్లికి ససేమిరా అంది. దీంతో రాయ్‌పూర్ నుంచి వచ్చిన పెళ్లికొడుకు తన కుటుంబ సభ్యులు, బంధువులతో వెనక్కి వెళ్లిపోయాడు. గొడవ సద్దుమణిగిన తర్వాత జరిపించాడు.