ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) సుక్మాలో డీఆర్‌జీ(DRG) జవాన్లు(Army), నక్సల్స్ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో(Encounter) ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల ఘ‌ట‌న అనంత‌రం భ‌ద్రతా బ‌ల‌గాలు అడవిని జ‌ల్లెడ‌ప‌డుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) సుక్మాలో డీఆర్‌జీ(DRG) జవాన్లు(Army), నక్సల్స్(Naxals) మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో(Encounter) ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల ఘ‌ట‌న అనంత‌రం భ‌ద్రతా బ‌ల‌గాలు అడవిని జ‌ల్లెడ‌ప‌డుతున్నాయి. "భేజీ(Bheji) ప్రాంతంలో నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది" అని సుక్మా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

గొలపల్లి ఎస్‌ఓఎస్ కమాండర్ మడ్కం ఎర్రా, ఎర్రా భార్య పొడియం భీమె పోలీసుల కాల్పుల‌లో మృతిచెందారు. మడ్కం ఎర్రాపై రూ. 8 లక్షలు రివార్డ్ ఉండ‌గా.. ఆయ‌న భార్య‌పై రూ. 3 లక్షల రివార్డు ఉంది. కాల్పులు జ‌రిగిన ప్రాంతంలో భద్రతా దళాలు ఆయుధాలు, భారీ మొత్తంలో ఐఈడీలు, ఆటోమేటిక్ ఆయుధాలతో సహా ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ నెల ప్రారంభంలో దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ సమీపంలో మావోయిస్టులు కుచ్చా రహదారిపై శక్తివంతమైన ఐఈడీని పేల్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో జిల్లా రిజర్వ్ గార్డ్స్ (DRG)కి 10 మంది జ‌వాన్లు స‌హా డ్రైవర్ మరణించారు.

Updated On 8 May 2023 12:07 AM GMT
Ehatv

Ehatv

Next Story