2024 సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) జైలు(Jail) నుంచి పోటీ చేసిన ఇద్దరు నిందితులు గెలుపొందారు. ఇందులో ఉగ్రవాద ఆరోపణలపై ఒకరు, మరొకరు రాడికల్‌ సిక్కు బోధకుడు ఉన్నారు. ఈ ఎంపీలు పార్లమెంట్‌కు హాజరుకావడంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. సభా కార్యకలాపాలకు హాజరుకాకుండా చట్టం అడ్డుకున్నా కానీ వారికి ప్రమాణస్వీకారం చేసే హక్కు ఉందంటున్నారు నిపుణులు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) జైలు(Jail) నుంచి పోటీ చేసిన ఇద్దరు నిందితులు గెలుపొందారు. ఇందులో ఉగ్రవాద ఆరోపణలపై ఒకరు, మరొకరు రాడికల్‌ సిక్కు బోధకుడు ఉన్నారు. ఈ ఎంపీలు పార్లమెంట్‌కు హాజరుకావడంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. సభా కార్యకలాపాలకు హాజరుకాకుండా చట్టం అడ్డుకున్నా కానీ వారికి ప్రమాణస్వీకారం చేసే హక్కు ఉందంటున్నారు నిపుణులు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం(Election Commission) మంగళవారం ప్రకటించింది. రాడికల్ సిక్కు బోధకుడు అమృతపాల్ సింగ్(Amritpal Singh) పంజాబ్‌లోని ఖాదూర్ సాహిబ్(Khadur Sahib) స్థానంలో గెలుపొందగా, టెర్రర్ ఫైనాన్సింగ్ నిందితుడు ఇంజనీర్ రషీద్‌గా ప్రసిద్ధి చెందిన షేక్ అబ్దుల్ రషీద్(Sheikh Abdul Rasheed) జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి గెలుపొందారు. ఇంజనీర్ రషీద్ టెర్రర్ ఫండింగ్ ఆరోపణలపై ఆగస్టు 9, 2019 నుంచి తీహార్ జైలులో ఉన్నాడు. అమృతపాల్ సింగ్‌ను జాతీయ భద్రతా చట్టం కింద ఏప్రిల్ 2023లో అరెస్టు చేసి అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.

జైల్లో ఉన్న ఈ కొత్త ఎంపీలను ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రాజ్యాంగ నిపుణుడు మరియు మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆచారి(Aachari) వివరిస్తూ పార్లమెంటు సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయడం రాజ్యాంగ హక్కు అన్నారు. కానీ వారు ప్రస్తుతం జైలులో ఉన్నందున, ఇంజనీర్ రషీద్, అమృతపాల్‌ సింగ్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం పార్లమెంటుకు వెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని, ప్రమాణం చేసిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఆచారి తెలిపారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సభకు హాజరు కాలేకపోవడంపై స్పీకర్‌కు లేఖ రాస్తామని చెప్పారు. స్పీకర్ వారి అభ్యర్థనలను హౌస్ కమిటీకి పంపిస్తారు. ఈ సభ్యులను సభా కార్యకలాపాలకు అనుమించాలా వద్దా అనేది హౌస్‌కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే రషీద్, సింగ్ దోషులుగా నిర్ధారించబడి కనీసం రెండేళ్ల జైలు శిక్ష విధించబడితే, 2013 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, అటువంటి కేసులలో MPలు మరియు ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించబడతారని పేర్కొన్నందున వారు వెంటనే లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారన్నారు.

Updated On 6 Jun 2024 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story