Lok Sabha : భద్రతా వైఫల్యం.. లోక్‌సభలో గందరగోళం..
లోక్‌సభలో(Lok Sabha) గందరగోళం నెలకొంది. లోక్‌సభలోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు.. షూ ద్వారా గ్యాస్(Gas) వదిలి హంగామా సృష్టించారు. ఈ సంఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది. దీంతో నిర్ఘాంతపోయిన ఎంపీలు(MPs) లోక్‌సభ నుంచి పరిగెత్తారు. షూలో(Shoe) గ్యాస్ అమర్చుకొని విజిటర్స్ గ్యాలరీలోకి(Visitors gallery) ప్రవేశించి అక్కడి నుంచి సభలోకి దూకారు. లోక్‌సభ బల్లలపై దూకుతూ గ్యాస్ వదిలి గందరగోళం సృష్టించారు.
లోక్‌సభలో(Lok Sabha) గందరగోళం నెలకొంది. లోక్‌సభలోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు.. షూ ద్వారా గ్యాస్(Gas) వదిలి హంగామా సృష్టించారు. ఈ సంఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది. దీంతో నిర్ఘాంతపోయిన ఎంపీలు(MPs) లోక్‌సభ నుంచి పరిగెత్తారు. షూలో(Shoe) గ్యాస్ అమర్చుకొని విజిటర్స్ గ్యాలరీలోకి(Visitors gallery) ప్రవేశించి అక్కడి నుంచి సభలోకి దూకారు. లోక్‌సభ బల్లలపై దూకుతూ గ్యాస్ వదిలి గందరగోళం సృష్టించారు. ఈ ఊహించని పరిణామంతో సభను స్పీకర్(Speaker) వాయిదా వేశారు. 'రాజ్యాంగాన్ని కాపాడాలని, నల్ల చట్టాలను బంద్ చేయాలని' ఆగంతకులు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఎంపీలే వారిని చుట్టుముట్టి పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఘటనతో మరోసారి భద్రతా వైఫల్యం(Security laps) స్పష్టంగా కనిపించింది. సరిగ్గా 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై(Parliament) ఉగ్రవాదులు(Terrorists) దాడి చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ 13 నాడు ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.