స్కాట్లాండ్‌లో(Scotland) విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం స్కాట్లాండ్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్ప్ఓయారు. ఓ పర్యాటక ప్రదేశంలో ప్రమాదవశాత్తూ నిట మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీట మునిగి చనిపోయారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్‌లోని భారత హై కమిషన్‌ ప్రతినిధి తెలిపారు.

స్కాట్లాండ్‌లో(Scotland) విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం స్కాట్లాండ్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్ప్ఓయారు. ఓ పర్యాటక ప్రదేశంలో ప్రమాదవశాత్తూ నిట మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీట మునిగి చనిపోయారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్‌లోని భారత హై కమిషన్‌ ప్రతినిధి తెలిపారు. డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న 22 ఏళ్ల చాణక్య బొలిశెట్టి, 27 ఏళ్ల జితేంద్రనాథ్ కరుటూరి వాటర్‌ఫాల్స్‌కు(Waterfall) పాపులర్‌ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం చూసేందుకు వెళ్లారు. అక్కడ వీరిద్దరు దుర్మరణం పాలయ్యారు. వీరితో పాటు అక్కడికి వెళ్లిన మరో ఇద్దరు విద్యార్థులు వెంటనే ఎమర్జెనీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. ఇదిలాఉంటే, విద్యార్థుల కుటుంబాలకు భారత కాన్సులేట్ జనరల్ సమాచారం అందించారు. అలాగే ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. డూండీ విశ్వవిద్యాలయం కూడా తగిన సాయం చేస్తామని ప్రకటించింది. పోస్ట్‌మార్టం అనంతరం వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

Updated On 19 April 2024 4:42 AM GMT
Ehatv

Ehatv

Next Story