ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) వారణాసిలో(Varanasi) దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు(Sisters) తమ తల్లి మృతదేహంతో(Dead body) ఏడాదికి పైగా నివసించారు. గత వారం పది రోజుల నుంచి అక్కాచెల్లెళ్లు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) వారణాసిలో(Varanasi) దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు(Sisters) తమ తల్లి మృతదేహంతో(Dead body) ఏడాదికి పైగా నివసించారు. గత వారం పది రోజుల నుంచి అక్కాచెల్లెళ్లు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు(Police) ఎంత పిలిచినా అక్కాచెల్లెళ్లు బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూసి దిగ్భ్రాంతి చెందారు. కుళ్లిపోయిన తల్లి ఉషా త్రిపాఠి(Usha Tripathi) శవంపక్కనే కూతుళ్లిద్దరూ కూర్చొని ఉండటాన్ని గమనించిన పోలీసులకు ఒళ్లు జలదరించింది. తల్లి అనారోగ్యంతో డిసెంబర్ 8, 2022లో చనిపోయింది. అయితే ఆమె ఇద్దరు కూతుళ్లు తల్లికి అంతిమ సంస్కారాలు చేయకుండా శవాన్ని ఇంట్లోనే ఒక గదిలో పెట్టి తాళం చేశారు. ఇద్దరూ చదువుకున్నవారే కావడం గమనార్హం. 27 ఏళ్ల పల్లవి త్రిపాఠి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 18 ఏళ్ల వైష్ణవి త్రిపాఠి పదో తరగతి పాసయ్యింది.