మణిపూర్‌లోని నరన్‌సేన ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కుకీ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్లు వీరమరణం పొందారు
మణిపూర్‌లోని నరన్‌సేన ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కుకీ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్లు వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2:15 గంటల మధ్య సీఆర్పీఎఫ్ జవాన్లపై కుకీ ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లు రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సేన ప్రాంతంలో మోహరించిన CRPF 128 బెటాలియన్‌కు చెందినవారు.
ఇదిలావుంటే.. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఔటర్ మణిపూర్‌లో అత్యధిక పోలింగ్ నమోదవుతుందని, కొద్దిపాటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయని మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. ఔటర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం, 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పరిశీలిస్తున్నామని.. అన్ని జిల్లా కేంద్రాలను సంప్రదిస్తున్నామని.. ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పారు. 2019 ఎన్నికలతో పోల్చితే ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని ఝా తెలిపారు.