శనివారం ఉదయం ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ స్టేషన్‌కు చేరుకోగానే రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు

శనివారం ఉదయం ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ స్టేషన్‌కు చేరుకోగానే రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం 5.40 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. జబల్పూర్ స్టేషన్ పశ్చిమ మధ్య రైల్వే (WCR) జోన్ పరిధిలోకి వస్తుంది.

"ఇండోర్-జబల్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22191) రైలు రెండు కోచ్‌లు జబల్‌పూర్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 6 వద్దకు చేరుకునే సమయంలో పట్టాలు తప్పింది" అని ఒక అధికారి తెలిపారు. పట్టాలు తప్పిన కోచ్‌లు ఇంజన్‌కు కొద్ది దూరంలోనే ఉన్నాయని.. ప్లాట్‌ఫారమ్‌కు 50 మీటర్ల దూరంలో పట్టాలు తప్పినట్లు ఆయన తెలిపారు. లోకో పైలట్ వెంటనే రైలును ఆపి.. ఇతర కోచ్‌లను లాగకుండా కాపాడాడు. ఇంజిన్‌కు ఆనుకుని ఉన్న రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి.. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణీకులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులు రైలు దిగి.. పక్కనే ఉన్న ట్రాక్‌లపై ట్రాఫిక్‌ అరగంట పాటు నిలిచిపోయిందని వర్మ తెలిపారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story