ఇంకమ్ టాక్స్(Income Tax) చెల్లించేందుకు డిసెంబర్ 31తో గడువు ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(IT Returns file) ఫైల్ చేసేందుకు ఇవ్వాళ ఒక్క రోజే చాన్స్ ఉంది. ఈ పని పెండింగులో ఉంటే వెంటనే పూర్తి చేయండి. అలాగే రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ కూడా ఈ రోజే చేయాల్సి ఉంది. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ఐటీ శాఖ సోషల్ మీడియా వేదికగా ఫైనల్ కాల్ చేసింది. 2023-24కుగానూ బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు ముగుస్తున్నట్లు ట్యాక్స్ పేయర్స్ ని అలర్ట్ చేసింది.
ఇంకమ్ టాక్స్(Income Tax) చెల్లించేందుకు డిసెంబర్ 31తో గడువు ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(IT Returns file) ఫైల్ చేసేందుకు ఇవ్వాళ ఒక్క రోజే చాన్స్ ఉంది. ఈ పని పెండింగులో ఉంటే వెంటనే పూర్తి చేయండి. అలాగే రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ కూడా ఈ రోజే చేయాల్సి ఉంది. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ఐటీ శాఖ సోషల్ మీడియా వేదికగా ఫైనల్ కాల్ చేసింది. 2023-24కుగానూ బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు ముగుస్తున్నట్లు ట్యాక్స్ పేయర్స్ ని అలర్ట్ చేసింది. ఒక వేళ ఈ గడువు సైతం మిస్ అయినట్లయితే మీకు మరో ఆప్షన్ ఉంటుంది. అదే అప్డేటెడ్ ఐటీఆర్. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 39 (8ఏ) ప్రకారం రెండేళ్లలోపు మీ ఐటీఆర్ అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఒరిజినల్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పటి నుంచి రెండేళ్లలోపు దీనిని లెక్కలోకి తీసుకుంటారు. ఐటీఆర్-యూ అనేది ట్యాక్స్ పేయర్స్ కు ఎలాంటి లీగల్ యాక్షన్ ఎదుర్కోకుండా పన్ను చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఆ కొత్త సేవలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2022లో అందుబాటులోకి తీసుకొచ్చింది.