మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలలో బారిల్ వన్నెహ్సాంగి(Baryl Vanneihsangi) అనే మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 40 మంది శాసనసభ్యులున్న మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో జెడ్‌పీఎం అభ్యర్థిగా బారిల్ వన్నెహ్సాంగి బరిలో దిగారు. ఆమె మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిని ఓడించి అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలలో బారిల్ వన్నెహ్సాంగి(Baryl Vanneihsangi) అనే మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 40 మంది శాసనసభ్యులున్న మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో జెడ్‌పీఎం అభ్యర్థిగా బారిల్ వన్నెహ్సాంగి బరిలో దిగారు. ఆమె మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిని ఓడించి అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. బారిల్ వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే! ఐజ్వాల్ సౌత్-III నుంచి పోటీ చేసిన బారిల్ మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లాల్నున్మావియాపై 9,370 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లో నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్‌ను అభ్యసించిన బారిల్ టెలివిజన్ న్యూస్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారు. తర్వాత సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయ్యారు. ఆమెకు 250కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రజలకు దగ్గరవ్వడానికి ఇది ఎంతగానో దోహదపడింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ఉపకరించింది. అంతే కాదు, ఇంతకు ముందు ఆమె ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పని చేశారు.