మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎదో అలజడి ఉంటూనే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ కూటమి మధ్య చిచ్చు రేగుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే తన పదవికి రాజీనామా చేసేంత వరకు వెళ్లారు.
మహారాష్ట్ర(Maharastra) రాజకీయాల్లో ఎప్పుడూ ఎదో అలజడి ఉంటూనే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) నేతృత్వంలోని శివసేన(Shivsena), బీజేపీ(BJP) కూటమి మధ్య చిచ్చు రేగుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే(MP Shrikant Shinde) తన పదవికి రాజీనామా చేసేంత వరకు వెళ్లారు. శ్రీకాంత్ షిండే విలేకరులతో మాట్లాడుతూ.. డోంబివిలీ(Dombivli)కి చెందిన కొందరు నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ-షిండే వర్గాని(కూటమి)కి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నాకు ఏ పదవిపై కోరిక లేదని అన్నారు. బీజేపీ-శివసేన సీనియర్ నాయకత్వం నిర్ణయించే అభ్యర్థికే నేను మద్దతిస్తాను. మళ్లీ బీజేపీ-శివసేన కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలో బీజేపీతో కలిసి పనిచేయడమే మా లక్ష్యం అన్నారు. ఈ విషయమై ఎవరైనా వ్యతిరేకిస్తే, ఎవరైనా కోపంగా ఉంటే, కూటమిలో గందరగోళం ఏర్పడితే, నేను నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
ఒక మహిళను వేధించినందుకు బీజేపీ కార్యకర్త నందు జోషి(Nandu Joshi)పై ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది. దీనికి సంబంధించి.. డోంబివిలి మాన్‌పాడ పోలీస్ స్టేషన్(Police Station)లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వెనుక శివసేన హస్తం ఉందని నందు జోషి, పలువురు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి రవీంద్ర చౌహాన్ నేతృత్వంలో డోంబివిలీలో బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శివసేనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది కాకుండా, లోక్‌సభ ఎన్నికల్లో(Loksabha Elections) 48 స్థానాలకు బీజేపీ గురువారం ఇన్‌చార్జ్‌ల పేర్లను ప్రకటించిందని మరో కారణం కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మరోమారు రాజకీయ అలజడి తప్పందని బావిస్తున్నారు విశ్లేషకులు.