మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) దతియా(Datia) జిల్లా దుర్సాదా పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న వంతెనపై(Bridge) నుంచి డీసీఎం(Truck) వాహనం నదిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో మరో 30 నుంచి 35 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న దటియా కలెక్టర్(Collector), ఎస్పీ(SP) సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) దతియా(Datia) జిల్లా దుర్సాదా పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న వంతెనపై(Bridge) నుంచి డీసీఎం(Truck) వాహనం నదిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో మరో 30 నుంచి 35 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న దటియా కలెక్టర్(Collector), ఎస్పీ(SP) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర హోం మంత్రి(home minister) నరోత్తమ్ మిశ్రా(Narottam Mishra) కూడా ఘటనపై వెంటనే స్పందించారు. స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
దుర్సాడ పోలీస్ స్టేషన్(Dursada Police Station) పరిధిలోని బుహరా గ్రామ సమీపంలో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి జనంతో ఉన్న డీసీఎం.. ఆ దారిలో వెళ్తూ నిర్మాణంలో ఉన్న వంతెనను ఢీకొని అదుపు తప్పి గువారా నదిలో(Guvara River) పడిపోయింది. డీసీఎంలో ఉన్న వ్యక్తులు గ్వాలియర్‌లోని బిల్హేటి గ్రామ నివాసితులు. తికమ్‌ఘర్‌లోని జాతరలో అమ్మాయి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. దటియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
డీసీఎం బోల్తా పడటంతో ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు కూడా మరణించారని రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ అరుణ్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.