మహారాష్ట్ర(Maharastra)లోని ధులే(Dhule) జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రంలోని ముంబై-ఆగ్రా హైవే పలాస్నర్ గ్రామ సమీపంలో ఓ కంటైనర్ ట్రక్ మొదట రెండు వాహనాలను ఢీకొట్టి.. ఆపై హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ముంబైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ట్రక్కు ముందుగా రెండు వాహనాలను ఢీకొట్టి.. బస్టాప్ సమీపంలోని ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మరణించిన వారిలో బస్సు కోసం వేచి ఉన్న కొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను శిర్పూర్, ధులేలోని ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.