దేశ రాజధాని ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్ జరిగింది. ఒకే కుటుంబానికి చెందిని ముగ్గురిని అత్యంత దారుణంగా, కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్ జరిగింది. ఒకే కుటుంబానికి చెందిని ముగ్గురిని అత్యంత దారుణంగా, కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. దక్షిణ ఢిల్లీ(Delhi)లోని నెబ్ సరాయ్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నెబ్‌సరాయి (Nebsarai)ప్రాంతంలో దంపతులు తమ కుమారుడు, కూతురుతో కలిసి ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడి దంపతులు రాజేష్(55), కోమల్(47), కూతురు కవిత(23)లపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కొడుకు ఉదయం 5 గంటలకు మార్నింగ్ వాక్ కోసం వెళ్లాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి.. తన తల్లిదండ్రులు, సోదరి రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి రాజేష్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడని తెలిపాడు. కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంట్లో దొంగతనం జరగలేదని.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. డిసెంబర్ 4న తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం ఉందని.. అందుకు ఏర్పాట్లు చేశామన్నాడు కుమారుడు.