పశ్చిమ బెంగాల్‌(west bengal) మఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee)మూడు టీవీ ఛానెల్స్‌పై నిషేధం విధించారు.

పశ్చిమ బెంగాల్‌(west bengal) మఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee)మూడు టీవీ ఛానెల్స్‌పై నిషేధం విధించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా పలు టీవీ ఛానెళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నది మమతా ఆరోపణ. అంతేకాదు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(Trinamool Congress) నేతలు ఎవరూ సదరు ఛానెల్స్‌లో నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశించారు మమతా బెనర్జీ. అభయ ఘటనపై రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ప్రమోటర్లు ఈడీ, సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఊడిగం చేస్తున్నారని, తాము వారిని అర్థం చేసుకున్నామని మమత ఎద్దేవా చేశారు. .

ehatv

ehatv

Next Story