ఓ మొబైల్ షాపు యజమాని ఐఫోన్ కొన్నవారికి ఉచితంగా రెండు కిలోల టమాటాలు ఇచ్చాడన్న వార్త చదవే ఉంటారు కదా! కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ మాత్రం ఆఫర్ ఇవ్వాల్సిందే ! ఇప్పుడు మార్కెట్‌లో పోటీని తట్టుకోవడానికి అందరూ టమాటాను చక్కగా వాడుకుంటున్నారు. టమాటానే(Tomato) కదా ఇప్పుడు హాట్ టాపిక్..
ఓ మొబైల్ షాపు యజమాని ఐఫోన్ కొన్నవారికి ఉచితంగా రెండు కిలోల టమాటాలు ఇచ్చాడన్న వార్త చదవే ఉంటారు కదా! కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ మాత్రం ఆఫర్ ఇవ్వాల్సిందే ! ఇప్పుడు మార్కెట్‌లో పోటీని తట్టుకోవడానికి అందరూ టమాటాను చక్కగా వాడుకుంటున్నారు. టమాటానే(Tomato) కదా ఇప్పుడు హాట్ టాపిక్.. అందుకే ఓ ట్రావెల్ ఏజెన్సీ(Travel agencies) చక్కటి ప్లాన్ వేసింది. తమ దగ్గర ఫ్లైట్ టికెట్(Flight Ticket) బుక్ చేసుకున్నవారికి టమాటాలు ఫ్రీ అంటూ ఆఫర్‌ను ప్రకటించింది. మదురైలో(Madurai) దేశీయ విమాన టికెట్(Domestic Flight Ticket) బుకింగ్‌కు కిలో టమాటా, అంతర్జాతీయ విమాన(International Flight) బుకింగ్‌కు కిలోన్నర టమాటాలు ఇవ్వనున్నట్టు ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించింది. తమిళనాడులో కూడా టమాటా రేట్ రోజురోజుకూ పెరుగుతోంది. కంట్రోల్ చేయడానికి సర్కార్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు టమాటాలను పంపిణీ చేస్తూ వినియోగదారులకు కొంచెం ఊరట కల్పిస్తోంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో మదురైలోని ఓ ట్రావెల్ ఏజెన్సీ ఇక్కడ విమాన టికెట్లు బుక్ చేసుకునేవారికి ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్‌కు కిలో టమాటా, విదేశీ విమానాల బుకింగ్‌కు కిలోన్నర టమాటాలను ఫ్రీగా ఇస్తామని తెలిపింది. ఈ కొత్త ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నదట!