దేశవ్యాప్తంగా సంచలనం సృష్టంచిన ట్రైనీ డాక్టర్‌(Trainee Doctor) హత్యాచార ఘటనలో భయం గొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టంచిన ట్రైనీ డాక్టర్‌(Trainee Doctor) హత్యాచార ఘటనలో భయం గొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. కోల్‌కతా(Kolkata)లోని ఆర్టీ కార్‌ప్రభుత్వ ఆసుపత్రి(RG Kar Government Hospital)లో జరిగిన ఈ దారుణ ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. ఈ నేరంలో నిందితుడు పోలీసు వాలంటీర్‌(Volunteer)సంజయ్‌ రాయ్‌(Sanjay Roy)తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా తెలుస్తోంది. ట్రైని డాక్టర్‌ జననాంగంలో 151 గ్రాముల వీర్యం ఉన్నట్టు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. ఇది కచ్చితంగా గ్యాంగ్‌ రేపేనని ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(All India Federation of Government Doctors' Associations)అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సువర్ణ గోస్వామి (Doctor Suvarna Goswamy)తెలిపారు. మృతురాలి శరీరంలో తీవ్రమైన గాయాలు ఉన్నాయని, ఒక వ్యక్తి ఇన్ని గాయలు చేయలేడని చెప్పారు. ఎక్కువ మంది కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనిపిస్తోందని సువర్ణ గోస్వామి అన్నారు. ఆమెను రేప్‌ చేసిన తర్వాత గొంతు నులిమి చంపేశారు. ఆ అమ్మాయి కదలకుండా ఉండేందుకు తలను గోడకు బలంగా అదిమిపెట్టారట దుర్మార్గులు. అందుకే తలకు బలమైన గాయమయ్యింది. మొహమంతా గీసుకుపోయింది. అరవకుండా ఉండటానికి నోరు మూసేశారు. గొంతుపై బలంగా నొక్కడంతో ధైరాయిడ్‌ కార్టిలేజ్(Thyroid Cartilage)చితికిపోయింది. జననాంగాల దగ్గర లోతైన గాయమయ్యింది. నడుము, పెదాలు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై గాయాలు ఉన్నాయి. రెండు కళ్ల నుంచి, నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ముక్కు నోరు గట్టిగా అదిమిపట్టి మూసేయడం వల్ల చర్మం పూర్తిగా కమిలిపోయింది. కాళ్లు పూర్తిగా 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగాయి. కటిభాగం దగ్గర పెల్విక్‌ గార్డిల్‌ చీలిపోయింది. కాళ్లను పూర్తిగా పక్కకు విరిచేశారు. ఇదంతా పోస్ట్‌మార్టం నివేదికలో తెలిసిన దారుణాలు. ఆమెను ఎంతగా హింసించారో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఆ అమ్మాయి మృతదేహాన్ని చూపించకుండా ఆసుపత్రి బయట మూడు గంటల పాటు తల్లిదండ్రులను నిలబెట్టారని కుటుంబసభ్యులు విలపిస్తూ చెప్పారు. తర్వాత తండ్రిని అనుమతించారు. తండ్రి వెళ్లి చూసినప్పుడు మృతురాలి ఒంటిపై దుస్తులు లేవని, కళ్లద్దాల ముక్కలు కంట్లో ఉన్నాయిని చెప్పారు. తమ పాపను అత్యంత దారుణంగా హింసించి చంపేశారని కన్నీరుమున్నీరవుతున్నారు.

ehatv

ehatv

Next Story