గురువారం పాఠశాల విహారయాత్ర (School Picnic) సందర్భంగా వడోదరలోని (Vadodara) హర్ని సరస్సులో (Harni Lake) పడవ బోల్తా పడటంతో 12 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు.
గురువారం పాఠశాల విహారయాత్ర (School Picnic) సందర్భంగా వడోదరలోని (Vadodara) హర్ని సరస్సులో (Harni Lake) పడవ బోల్తా పడటంతో 12 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు. బోటులో 16 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉండగా, ఘటన జరిగిన సమయంలో అందులో 30- 34 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనలో 18 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులను రక్షించారు. సరస్సు దిగువన ఉన్న బురద కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని ఎన్డీఆర్‌ఎఫ్ తెలిపింది.
పోలీసుల వివరాల ప్రకారం న్యూ సన్‌రైజ్ స్కూల్‌కు ( New Sunrise School ) చెందిన విద్యార్థులు గురువారం సాయంత్రం 4.30 గంటలకు స్కూల్ పిక్నిక్‌లో భాగంగా పడవ ఎక్కారు. మొత్తం 60 మంది విద్యార్థులు విహారయాత్రలో ఉన్నారు. పిల్లలు సాయంత్రం 4.30 గంటలకు సరస్సు వద్దకు చేరుకున్నారు.. ఉపాధ్యాయులతో కలిసి పడవ ఎక్కారు. ఓవర్ లోడ్ కారణంగానే పడవ బోల్తా పడ్డట్లు సమాచారం. 2016లో సుందరీకరణ తర్వాత వడోదర మునిసిపల్ కార్పొరేషన్ ఇక్కడ బోటింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ బోటింగ్‌ను కోటియా ప్రాజెక్ట్స్ (Kotia Projects) అనే ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తోంది. ఫెసిలిటీ మేనేజర్‌తో సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బోటింగ్ చేస్తున్న ఏజెన్సీపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.