తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన సోనియా గాంధీకి(Sonia gandhi) తెలంగాణ కాంగ్రెస్(Congress) పార్టీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీని రాజ్యసభకు(Rajya sabha) పంపే అవకాశాలను రాష్ట్ర పార్టీ పరిగణిస్తోంది. సొంతంగా పార్టీ రెండు సీట్లు గెలుచుకోగలిగినప్పటికీ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో మూడో సీటు కూడా కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన సోనియా గాంధీకి(Sonia gandhi) తెలంగాణ కాంగ్రెస్(Congress) పార్టీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీని రాజ్యసభకు(Rajya sabha) పంపే అవకాశాలను రాష్ట్ర పార్టీ పరిగణిస్తోంది. సొంతంగా పార్టీ రెండు సీట్లు గెలుచుకోగలిగినప్పటికీ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో మూడో సీటు కూడా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. పార్టీ తెలంగాణ నుండి ఇద్దరు అభ్యర్థులను నామినేట్ చేసే అవ‌కాశం ఉంది. మూడవ స్థానానికి రాష్ట్రం వెలుపల నుండి మరొకరిని నామినేట్ చేయవచ్చు. కానీ టీపీసీసీ(TPCC) అలా చేస్తే బీజేపీ(BJP), బీఆర్‌ఎస్‌తో(BRS) సహా విపక్షాలు కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకమని ఆరోపిస్తాయి.

దీంతో సోనియా గాంధీ అంగీకరించినట్లయితే.. ఆమె లోక్‌సభకు పోటీ చేయకూడదని నిర్ణయించుకుంటే మూడవ సీటుకు ఆమెను పోటీకి దింపాలని టీపీసీసీ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే కీలక నిర్ణయం సోనియాగాంధీ తీసుకున్నందున.. ఆమె పోటీలో ఉంటే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించదు. సోనియాగాంధీ వయస్సు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని, అందుకే ఆమెను రాజ్యసభకు పంపడమే ఉత్తమ బహుమతి అని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ విషయమై రాష్ట్ర నాయకత్వం పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం

Updated On 30 Jan 2024 8:08 AM GMT
Ehatv

Ehatv

Next Story