Revanth Reddy : అమ్ముడుపోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వొద్దు
నర్సాపూర్‌లో(Narsapur) జరిగిన కాంగ్రెస్(Congress) విజయభేరి యాత్ర(Vijayabheri Yatra) బహిరంగ సభలో టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభకు తరలివచ్చిన ప్రజానీకానికి అభినందనలు తెలిపారు. నాయకులు పదవుల కోసం అమ్ముడుపోయినా.. కార్యకర్తలు పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారని.. పార్టీ ఫిరాయించిన ఒక నమ్మకద్రోహికి బీఆర్ఎస్(BRS) ఇక్కడి టికెట్ ఇచ్చిందని విమర్శించారు. నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు.

Revanth Reddy

నర్సాపూర్ లాంబాడి సోదరుల అడ్డా.. లాంబాడాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. అధికారంలోకి రాగానే నర్సాపుర్ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దన్నారు. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్(KCR).. బొందలగడ్డ తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నెంబర్ 1 అని చెప్తుండు.. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్-1.. నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్.. దేశంలోనే నెంబర్ 1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారని విమర్శించారు. అమ్ముడుపోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దని సిలుపునిచ్చారు.
సోనియమ్మ(Sonia Gandhi) తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడక్కు తినేదన్నారు. కేసీఆర్ .. సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్‌గా నీకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ కాదా.? అని ప్రశ్నించారు. కేసీఆర్.. ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మరిచిపోయావా.? అని ప్రశ్నించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కేసీఆర్ ను వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలన్నారు. తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోంది.. రాచరిక పాలన సాగుతోందని విమర్శలు గుప్పించారు. ఇక కేసీఆర్ పాలనకు కాలం చెల్లింది.. ఆయన్ను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసిందన్నారు.