కర్ణాటకలో(Karnataka) బీజేపీ(BJP) కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. కర్ణాటక ఎన్నికల(karnataka Elections) ఫలితాల నేపథ్యంలో నిలోఫర్ వద్ద హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ..

Revanth Reddy
కర్ణాటకలో(Karnataka) బీజేపీ(BJP) కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. కర్ణాటక ఎన్నికల(karnataka Elections) ఫలితాల నేపథ్యంలో నిలోఫర్ వద్ద హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్(congress) వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారని అన్నారు. శ్రీరాముడిని అడ్డుపెట్టుకుని పార్టీని విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలన్నారు. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారని.. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడాని సెటైర్లు వేశారు.
కర్ణాటకలో ప్రజలు బీజేపీని ఓడించి మోదీని, జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కారించారని రేవంత్ అన్నారు. కర్ణాటక తీర్పును కాంగ్రెస్ సాధరంగా స్వాగతిస్తుందన్నారు. దేశంలో ఇవే ఫలితాలు రాబోతున్నాయని జోష్యం చెప్పారు. తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.
