హిమాచల్‌ప్రదేశ్‌కు(Himachal Pradesh) పర్యాటకుల(Tourist) తాకిడి విపరీతంగా పెరిగింది. క్రిస్మస్(Christmas), కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వేలాది మంది హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లా మనాలికి(Manali) పర్యాటకులు పోటెత్తారు. కులు జిల్లాలోని పర్యాటక పట్టణం మనాలిలో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి, లాహౌల్ లోయలో మంచును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌కు(Himachal Pradesh) పర్యాటకుల(Tourist) తాకిడి విపరీతంగా పెరిగింది. క్రిస్మస్(Christmas), కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వేలాది మంది హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లా మనాలికి(Manali) పర్యాటకులు పోటెత్తారు. కులు జిల్లాలోని పర్యాటక పట్టణం మనాలిలో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి, లాహౌల్ లోయలో మంచును చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అసలే ఇరుకు రోడ్లు ఉండే ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు(Traffic Jam) ఏర్పడుతున్నాయి. కులు, లాహౌల్‌, రోహ్‌తంగ్‌లోని అటల్‌ సొరంగ మార్గంలో గత మూడు రోజుల్లో దాదాపు 55 వల వాహనాలు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో లక్షకుపైగా వాహనాలు సిమ్లాలోకి(Simla) ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పర్యాటకుల రాక ఆ శాఖకు ఊతమిచ్చినప్పటికీ, ట్రాఫిక్‌ నిర్వహణ అధికారులకు సవాలుగా మారింది. ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ఓ పర్యాటకుడు అత్యంత సాహసానికి పాల్పడ్డాడు. తన నడుపుతున్న ఎస్‌యూవీ కారును(SUV Car) నదిలోకి దారి మళ్లించాడు. లాహౌల్‌ వ్యాలీలోని చంద్ర నదిలో(Chandra River) మహీంద్రా థార్‌ ఎస్‌యూవీని నడిపాడు. నదిలో పెద్దగా నీటిమట్టం లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. దీంతో అప్రమత్తమైన అక్కడి పోలీసులు ఆ వాహనదారుడిపై చర్యలు తీసుకున్నారు. పర్యాటకుడికి పోలీసులు చలానా విధించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బందోబస్తు చేపట్టామని ఎస్పీ మయాంక్‌చౌదరి తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహీంద్రా వాహనదారుడు బాధ్యతారహితంగా వ్యవహరించాడని పలువురు విమర్శించారు.

Updated On 26 Dec 2023 12:48 AM GMT
Ehatv

Ehatv

Next Story