యావత్ మానవాళిని మైమరపించి అబ్బురపరిచి ఆకట్టుకునే భూతల స్వర్గం. కళ్ళను కట్టిపడేసే అందాలలోయలు, కనువిందు చేసే కమనీయ దృశ్యాలకు నిలయం కాశ్మీర్. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించే వేసవి విడిది కేంద్రంగా అందాల లోకంగా కొనియాడ పడుతు విశ్వవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని గడించిన కలల సౌధం కాశ్మీర్. దీనిని కాశ్మీరు లోయ, " వేల్ ఆఫ్ కాశ్మీర్ " అని పిలుస్తారు. పది జిల్లాలతో కూడిన కాశ్మీర్ లో శ్రీనగర్ ముఖ్య నగరం. ఈ భూభాగానికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతోసరిహద్దులు,దక్షిణాన హిమాచల్ […]
యావత్ మానవాళిని మైమరపించి అబ్బురపరిచి ఆకట్టుకునే భూతల స్వర్గం. కళ్ళను కట్టిపడేసే అందాలలోయలు, కనువిందు చేసే కమనీయ దృశ్యాలకు నిలయం కాశ్మీర్.
దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించే వేసవి విడిది కేంద్రంగా అందాల లోకంగా కొనియాడ పడుతు విశ్వవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని గడించిన కలల సౌధం కాశ్మీర్.
దీనిని కాశ్మీరు లోయ, " వేల్ ఆఫ్ కాశ్మీర్ " అని పిలుస్తారు. పది జిల్లాలతో కూడిన కాశ్మీర్ లో శ్రీనగర్ ముఖ్య నగరం.
ఈ భూభాగానికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతోసరిహద్దులు,దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ కలదు. ఇక్కడ ముస్లిం లు అధిక శాతంలో ఉంటారు. కాశ్మీరు లోయలోని శ్రీనగర్ తో పాటు బారాముల్లా, అనంతనాగ్, పుల్వామా ప్రధాన నగరాలు కలవు. కాశ్మీరులో ముఘల్ ఉద్యానవనాలు, శ్రీనగర్, గుల్‌మార్గ్, పహల్‌గావ్కా ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా పిలవబడుతాయి.
శ్రీ నగర్ లోని దళ్ సరస్సు శ్రీనగర్ కు ఆభరణం. పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది.ఇక్కడి గోల్ఫ్ కోర్సు పూర్తిగా మంచుతో కప్పబడి వుంటుంది.
అంతే కాదు ఇక్కడ ఇందిరా గాంధి తులిప్ గార్డెన్ ఒక ప్రధాన ఆకర్షణ. శ్రీనగర్ లో ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో తులిప్ పండుగకు వస్తారు. కార్గిల్ ప్రకృతి అందాలు పర్యాటకులను మరల మరల రప్పించేలా చేస్తాయి. ఇంకా ఇక్కడ అనేక ప్రదేశాలు కలవు.
సుమారు 135 కిమీ పొడవు, 32 కి.మీ వెడల్పు లతో భారతదేశానికి ఉత్తరాన పెట్టని గోడవలే నెలకొని ఉన్న హిమాలయ పర్వత శ్రేణులలో కేంద్రపాలిత ప్రాంతం. సముద్ర మట్టానికి 12,959 అడుగుల ఎత్తులోరిసార్ట్ లు వుంటాయి. ఈ లోయకు నైరుతిదిశలో పీర్ పంజాల్ శ్రేణి, ఈశాన్యంలో ప్రధాన హిమాలయ శ్రేణి కలదు. ఇక్కడ ప్రధానంగా జీలం నది ప్రవహిస్తోంది. ఈ ప్రాంతం రాజకీయంగా, భౌగోళికంగా భారతదేశం, పాకిస్తాన్ల మధ్య వివాదస్వధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికీ ఏర్పాటు వాదం, ఉగ్రవాదం కు సంభవించిన అంశాలు ప్రబలంగా వినిపిస్తాయి. కశ్మీర్ సమస్యాత్మక ప్రాంతంగానే ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా సుందర నగరం కీలకపాత్ర పోషిస్తుంది